అక్టోబర్ 2018 అవార్డ్స్
Sakshi Education
ఏపి ట్రాన్స్ కోకు గోల్డెన్ పీకాక్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో కు గోల్డెన్ పీకాక్ అవార్డు-2018 లభించింది. ఈ మేరకు కార్పొరేట్ గవర్నెన్స్, సుస్థిరతపై లండన్‌లో నిర్వహించిన 18వ అంతర్జాతీయ సదస్సులో అక్టోబర్ 25న ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆర్ధిక నిర్వహణ, సరఫరా, పంపిణీ నష్టాల తగ్గింపులో అత్యుత్తమ పనితీరు కనబరిచినందుకు ట్రాన్స్‌కోకు ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం ఏపి ట్రాన్స్ కో సీఎండీగా విజయానంద్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గోల్డెన్ పీకాక్ అవార్డు-2018
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ కో
ఎమ్మెస్ స్వామినాథన్‌కు అగ్రికల్చర్ ప్రైజ్
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్‌కు (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్) ఐసీఎఫ్‌ఏ అగ్రికల్చర్ ప్రైజ్ లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో అక్టోబర్ 26న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. వ్యవసాయ రంగంలో విశేష సేవలు అందించినందుకుగాను స్వామినాథన్ కు ఈ అవార్డు దక్కింది. ఐసీఎఫ్‌ఏ ప్రకటించిన అగ్రికల్చర్ ప్రైజ్‌ను మొదటిసారి అందుకున్న వ్యక్తి స్వామినాథన్ గుర్తింపు పొందారు. అగ్రికల్చర్ ప్రైజ్ కింద లక్ష డాలర్ల బహుమతిని ఆయనకు అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐసీఎఫ్‌ఏ అగ్రికల్చర్ ప్రైజ్
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్
తెలంగాణ విత్తన సంస్థ కమిషనర్ కు గ్లోబల్ సీఈవో అవార్డు
తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కమిషనర్ కె. కేశవులు కి గ్లోబల్ సీఈవో అవార్డు లభించింది. ఈ మేరకు ఢిల్లీలో అక్టోబర్ 26న జరిగిన కార్యక్రమంలో భారత ఆహార, వ్యవసాయ మండలి ఈ అవార్డును అందజేసింది. వ్యవసాయరంగంలో ఉత్తమ విధానాలకు అమలుకు కృషి చేసినందుకుగాను కేశవులుకు ఈ అవార్డు దక్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ సీఈవో అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 26
ఎవరు : కె. కేశవులు
తెలంగాణకు టూరిజంకు ఫిల్మ్ అవార్డు
తెలంగాణ పర్యాటక శాఖ రూపొందించిన ‘విజట్ తెలంగాణ’చిత్రానికి ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు లభించింది. యూరప్‌లోని పోర్చుగల్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 27న రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫిల్మ్ మేకర్ సత్యనారాయణ అవార్డును స్వీకరించారు. ఈ సందర్భంగా బుర్రా మాట్లాడుతూ... హైదరాబాద్‌లో అంతర్జాతీయ టూరిజం ఫెస్టివల్ నిర్వహణకు చర్యలు చేపట్టామని, ఇందులో భాగంగా త్వరలో నిర్వాహకుల బృందం హైదరాబాద్‌లో పర్యటించనుందని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏషియన్ టూరిజం ఫిల్మ్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 27
ఎవరు : తెలంగాణ పర్యాటక శాఖ
ఎక్కడ : ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో
ఎందుకు : ‘విజట్ తెలంగాణ’చిత్రానికి
తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఆగ్రో వరల్డ్ అవార్డు
తెలంగాణ ఆయిల్‌ఫెడ్‌కు ఇఫ్కా-భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలోని ప్రతిష్టాత్మక ఆగ్రో వరల్డ్-2018 అవార్డు లభించింది. ఢిల్లీలో అక్టోబర్ 28న జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. నూనె దిగుబడి పెరగడంలో కృషి చేసినందకు ఈ అవార్డు దక్కింది. రాష్ట్రంలో సగటున 18.84 శాతం నూనె దిగుబడి వస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆగ్రో వరల్డ్-2018 అవార్డు 28
ఎప్పుడు : అక్టోబర్
ఎవరు : తెలంగాణ ఆయిల్‌ఫెడ్
శాంతినారాయణకు ‘నూతలపాటి’ పురస్కారం
అనంతపురం జిల్లాకి చెందిన ప్రఖ్యాత నవల, కథా రచయిత డాక్టర్ శాంతినారాయణకు ‘నూతలపాటి సాహితీ పురస్కారం’ లభించింది. ఈ మేరకు సాహితీ పురస్కార కమిటీ అక్టోబర్ 31న ప్రకటించింది. శాంతినారయణ రచించిన ‘బతుకు బంతి’ కథా సంపుటికి ఈ అవార్డు దక్కింది. నవంబర్ 15న తిరుపతిలో జరిగే గంగాధర 79వ జయంతి సాహితీ సభలో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నూతలపాటి సాహితీ పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : డాక్టర్ శాంతినారాయణ
ఫాలీ ఎస్ నారిమన్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి అవార్డు
న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది ఫాలీ ఎస్ నారిమన్‌కు లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్‌లెన్స్ అవార్డు-2018 లభించింది. ఈ మేరకు ఢిల్లీలో అక్టోబర్ 22న జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... లాల్‌బహదూర్ శాస్త్రి ఒక గొప్ప నాయకుడు అని చెప్పారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ ఎక్స్‌లెన్స్ అవార్డు-2018
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : ఫాలీ ఎస్ నారిమన్
ఎక్కడ : ఢిల్లీ
తెలంగాణ రచయిత్రి శక్తి భట్ పురస్కారం
అమెరికాలో స్థిరపడిన తెలంగాణ దళిత రచయిత్రి సుజాత గిడ్లకు 2018 సంవత్సరానికిగాను ‘శక్తి భట్ తొలి రచన’ పురస్కారం లభించింది. ఆమె రచించిన ‘యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ : యాన్‌అంటచబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ అనే పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు సుజాతను శక్తిభట్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు జడ్జిల ప్యానెల్ అక్టోబర్ 19 ప్రకటించింది. పేదల జీవితం, పితృస్వామ్య వ్యవస్థ, తిరుగుబాటు, కమ్యూనిజం తదితర అంశాలపై ఈ పుస్తకంలో సుజాత వివరించారు. యువ రచయిత శక్తి స్మారకార్థం శక్తి భట్ ఫౌండేషన్ 2008లో ఈ అవార్డును నెలకొల్పింది. ఈ పురస్కారం కింద రూ.2 లక్షలు ఇస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : శక్తి భట్ తొలి రచన-2018 పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 19
ఎవరు : సుజాత గిడ్ల
ఎందుకు : ‘యాంట్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ : యాన్‌అంటచబుల్ ఫ్యామిలీ అండ్ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా’ అనే పుస్తకానికి
ప్రధాని మోదీకి సియోల్ శాంతి బహుమతి
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సియోల్ శాంతి బహుమతి-2018 లభించింది. ఈ మేరకు సియోల్ శాంతి పురస్కార కమిటీ అక్టోబర్ 24న ప్రకటించింది. అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి చేసిన అత్యున్నత సేవలకుగాను మోదీ ఈ పురస్కారం దక్కింది. 1990లో సియోల్‌లో జరిగిన 24వ ఒలింపిక్ క్రీడల విజయానికి గుర్తుగా సియోల్ శాంతి పురస్కారాన్ని రెండేళ్లకోసారి ఇస్తున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సియోల్ శాంతి బహుమతి-2018
ఎప్పుడు : అక్టోబర్ 24
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : అంతర్జాతీయ సహకారం, ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి విశేష సేవలందించినందుకు
జమ్మూ కశ్మీర్ పోలీసుకు శౌర్య చక్ర అవార్డు
ఉగ్రవాదులను మట్టుబెట్టే క్రమంలో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించి అశువులు బాసిన జమ్మూకశ్మీర్ పోలీసు కానిస్టేబుల్ మన్జూర్ అహ్మద్ నాయక్‌ను మరణానంతరం శౌర్య చక్ర అవార్డు వరించింది. ఈ మేరకు అసాధారణ ధైర్య సాహసాలతో ఉగ్రవాదలను మట్టుబెట్టిన మన్జూర్‌కు శౌర్యచక్రను ప్రకటిస్తున్నట్లు అక్టోబర్ 11న కేంద్ర హోంశాఖ తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉడీ ప్రాంతానికి చెందిన మన్జూర్ దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో 2017 మే 5న మిలిటెంట్లకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మరణించాడు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జమ్మూ కశ్మీర్ పోలీసుకు శౌర్య చక్ర అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 11
ఎవరు : మన్జూర్ అహ్మద్ నాయక్
జయరాజుకు సుద్దాల జాతీయం పురస్కారం
ప్రఖ్యాత ప్రజా కవి జయరాజుకు సుద్దాల హనుమంతు- జానకమ్మల జాతీయం పురస్కారం లభించింది. హైదరాబాద్‌లో అక్టోబర్ 14న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ తాజా మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఈ అవార్డును అందజేశారు. ప్రతికూల పరిస్థితుల్లో ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసిన గొప్ప ప్రజా కవి సుద్దాల హనుమంతు అని ఈ సందర్భంగా స్పీకర్ కొనియాడారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సుద్దాల హనుమంతు- జానకమ్మ జాతీయ పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : జయరాజు
ఎక్కడ : హైదరాబాద్
ఒడిశా పోలీసు అధికారికి అశోకచక్ర
నక్సల్స్‌తో పోరాడుతూ వీరమరణం పొందిన ఒడిశా పోలీసు అధికారి ప్రమోద్‌కుమార్ సత్పతికి అశోకచక్ర అవార్డు లభించింది. సత్పతి ధైర్యసాహసాలు గుర్తిస్తూ ఆయనకు మరణానంతరం అశోకచక్రను ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ అక్టోబర్ 14న వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్‌ఓజీ) అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేసిన సత్పతి 2008, ఫిబ్రవరి 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత ప్రాణత్యాగం చేసిన పోలీసుల జ్ఞాపకార్థం నిర్మించిన స్మారక స్థూపంపై సత్పతి పేరును కూడా చేర్చనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ 21న ఈ స్మారకాన్ని ఆవిష్కరించనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఒడిశా పోలీసు అధికారికి అశోకచక్ర అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : ప్రమోద్‌కుమార్ సత్పతి
ఏపీ మహిళా రైతులకు జాతీయ పురస్కారాలు
వ్యవసాయ రంగంలో రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మహిళా రైతులకు జాతీయ పురస్కారాలు లభించాయి. ఈ మేరకు మహిళా కిసాన్ దివాస్‌ను పురస్కరించుకొని అక్టోబర్ 15న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ఈ అవార్డులను ప్రదానం చేశారు. వరిసాగులో సాంకేతిక పద్ధతిని అమలు చేసి మంచి ఫలితాలు సాధించిన కృష్ణా జిల్లాకు చెందిన పద్మావతికి, మేలు జాతి ఆవులతో డైరి ఏర్పాటు చేసి రాణిస్తున్న తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వెంకట సత్యవాణి ఈ పురస్కారాలు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ మహిళా రైతులకు జాతీయ పురస్కారాలు
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : పద్మావతి, వెంకట సత్యవాణి
భారత సంతతి వ్యక్తికి ఐన్‌స్టీన్ ప్రైజ్
భారత సంతతి వ్యక్తి ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్‌కు ‘ఐన్‌స్టీన్ ప్రైజ్-2018’ లభించింది. ఈ మేరకు అమెరికన్ ఫిజికల్ సొసైటీ (ఏపీఎస్) అక్టోబర్ 15న ప్రకటించింది. 1974లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన అభయ్... లూప్ క్వాంటమ్ గ్రావిటీ ప్రోగ్రామ్‌పై అనేక పరిశోధనలు చేశారు. ప్రస్తుతం ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీలో ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్రావిటేషన్ అండ్ ది కాస్మోస్‌కి డెరైక్టర్‌గా అభయ్ పనిచేస్తున్నారు. అక్టోబర్ 23న జరగనున్న అవార్డుల ప్రదానోత్సవంలో అభయ్ ఐన్‌స్టీన్ ప్రైజ్-2018తోపాటు పదివేల డాలర్లను నగదు ప్రోత్సాహకాన్ని అందుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐన్‌స్టీన్ ప్రైజ్-2018
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : ప్రొఫెసర్ అభయ్ అష్టేకర్
ప్రతిభా పురస్కారాల ప్రదానం
రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7,010 మంది విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ ప్రతిభా పురస్కారాలను అక్టోబర్ 15న ప్రదానం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ప్రతిభ పురస్కారాలు అందుకున్న విద్యార్థులు ప్రభుత్వ కొలువులు సాధిస్తే వారికి ఏడాది అదనపు సర్వీసునిచ్చి 61 ఏళ్ల వరకు ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. దివంగత రాష్ట్రపతి అబ్దుల్‌కలాం జయంతిని పురస్కరించుకుని పది, ఇంటర్, డిగ్రీల్లో అత్యుత్తమ మార్కులు, గ్రేడ్ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వం ఏటా ఈ పురస్కాలను అందిస్తోంది. ఈ సారి అవార్డులు అందుకున్న వారిలో 62 శాతం బాలికలు ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ప్రభుత్వ ప్రతిభా పురస్కారాల ప్రదానం
ఎప్పుడు : అక్టోబర్ 15
ఎవరు : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
ఎక్కడ : ఒంగోలు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్
ఐర్లాండ్ రచయిత్రికి మ్యాన్ బుకర్ ప్రైజ్
ఆంగ్ల సాహిత్యంలో ప్రతిష్టాత్మక మ్యాన్ బుకర్ ప్రైజ్‌ను ఈ ఏడాదికి ఐర్లాండ్ రచయిత్రి అన్నా బర్న్స్(56) గెలుచుకున్నారు. ఆమె రచించిన ‘మిల్క్ మ్యాన్’ నవలకు ఈ అవార్డు దక్కింది. 20వ శతాబ్దం చివరినాళ్లలో ఉత్తర ఐర్లాండ్‌లో జాత్యంతర ఘర్షణలు, రాజకీయ అస్థిరతకాలంలో ఓ యువతి, వివాహితుడితో సంబంధం ఏర్పర్చుకున్న ఇతివృత్తంతో ఈ నవల సాగుతుంది. ఆనాటి పరిస్థితులను మిల్క్‌మ్యాన్ ఎంతో సహజంగా కళ్లకు కట్టిందని ఎంపిక కమిటీ కొనియాడింది. మ్యాన్‌బుకర్ ప్రైజ్ 49 ఏళ్ల ప్రస్తానంలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఉత్తర ఐరిష్ మహిళగా అన్నా గుర్తింపు పొందారు. లండన్‌లో అక్టోబర్ 16న జరిగిన అవార్డు ప్రదాన కార్యక్రమంలో అన్నా బర్న్స్‌కు ఈ అవార్డు కింద రూ. 50.85 లక్షల చెక్కు, ట్రోఫీ బహూకరించారు.
పేర్లు లేవు.. హోదాలే: ‘మిల్క్‌మ్యాన్’ నవల.. నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ కట్టుబాట్లను సవాలుచేసే సాధారణ యువతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఇందులో పాత్రదారులకు పేర్లు ఎలాంటి పేర్లు పెట్టకుండా వారి హోదాలతోనే నవలను ముందుకు నడపడం విశేషం. ‘ఇంత వరకూ మనలో ఎవరూ ఇలాంటి నవలను చదవలేదు. పాఠకులను కట్టిపడేసే రచనాశైలితో అన్నా రూపొందించిన పాత్రధారులు సాధారణ ఆలోచనాధోరణులను సవాలుచేస్తాయి’ అని ఎంపిక కమిటీ వ్యాఖ్యానించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేత
ఎప్పుడు: అక్టోబర్ 16
ఎవరు: అన్నా బర్న్స్
ఎక్కడ: లండన్
ఇద్దరికి నోబెల్ శాంతి పురస్కారం
ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, అంతర్యుద్ధాలు జరుగుతున్న కల్లోలిత ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై పోరాటం చేస్తున్న ఇద్దరు వ్యక్తులకు 2018 ఏడాదికి నోబెల్ శాంతి పురస్కారం లభించింది. కాంగోకు చెందిన వైద్యుడు డెనిస్ మక్వీజ్(63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన నదియా మురాద్(25) ఈ పురస్కారానికి ఎంపికైనట్లు నోబెల్ ఎంపిక కమిటీ అక్టోబర్ 5న ప్రకటించింది.
కాంగోలో యుద్ధ సమయాల్లో లైంగిక హింసకు గురైన మహిళలు శారీరక, మానసిక క్షోభ నుంచి కోలుకునేలా మక్వీజ్ గత రెండు దశాబ్దాలుగా సేవ చేస్తున్నారు. 1999లో తాను స్థాపించిన ఆసుపత్రిలో వేలాది మంది బాధితులకు చికిత్స అందించారు. ‘డాక్టర్ మిరాకిల్’గా పిలిచే మక్వీజ్..యుద్ధ సమయాల్లో మహిళలపై దాష్టీకాలను ఖండించారు.
2014లో ఐఎస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన నదియా..మూడు నెలల తరువాత వారి చెర నుంచి తప్పించుకుంది. ఉగ్రవాదులు లైంగిక బానిసలుగా చేసుకున్న వేలాది మంది యాజిది మహిళలు, చిన్నారుల్లో నదియా కూడా ఉన్నారు. నదియా పోరాట ఫలితంగా ఇరాక్‌లో ఐసిస్ దురాగతాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది.
ద లాస్ట్ గర్ల్ పుస్తకం
తన తోటి యాజిదీలు ఎదుర్కొంటున్న దయనీయ పరిస్థితుల గురించి ‘ద లాస్ట్ గర్ల్’ పేరుతో నదియా మురాద్ పుస్తకం రాసింది. 2017లో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోబెల్ శాంతి పురస్కారం-2018
ఎప్పుడు : అక్టోబర్ 5
ఎవరు : డెనిస్ మక్వీజ్, నదియా మురాద్
ఎందుకు : లైంగిక హింసపై పోరాటం చేస్తున్నందుకు
లక్నో విద్యార్థుల గిన్నిస్ రికార్డ్
లక్నోకు చెందిన జీడీ గోయెంకా పబ్లిక్ స్కూల్‌కు చెందిన సుమారు 550 మంది విద్యార్థులు ఏక కాలంలో అరటి పండు నుంచి డీఎన్‌ఏను వేరు చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో అక్టోబర్ 5 నుంచి 8 వరకు జరిగిన ఇండియా ఇంటర్నేషన్ సైన్స్ ఫెస్టివల్‌లో (ఐఐఎస్‌ఎఫ్ 2018)లోభాగంగా వీరు ఈ ఘనత సాధించారు. 13-17 ఏళ్ల విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేశారు. శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అనుగుణంగా స్లైడర్స్‌తో 61 నిమిషాల పాటు వివరణ ఇచ్చారు. గతంలో అమెరికాకు చెందిన 302 విద్యార్థులు ఉమ్మడిగా ఈ ప్రయోగం చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : లక్నోకి చెందిన 550 మంది విద్యార్థుల గిన్నిస్ రికార్డ్
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎక్కడ : ఐఐఎస్‌ఎఫ్ 2018లో భాగంగా
ఎందుకు : ఏక కాలంలో అరటి పండు నుంచి డీఎన్‌ఏ వేరుచేసి
ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్
అమెరికాకి చెందిన ఇద్దరు ఆర్థికవేత్తలకు 2018 ఏడాదికిగాను ఆర్థికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ మేరకు విలియం నోర్ధాస్ (77), పాల్ రోమర్ (62)లు ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 8న ప్రకటించింది. సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థిక వృద్ధికి జోడించినందుకుగాను నోర్ధాస్, రోమర్‌కు ఈ పురస్కారం దక్కింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, నోర్ధాస్, రోమర్‌లు ఆ మొత్తాన్ని చెరిసగం పంచుకుంటారు.
అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా విలియం నోర్ధాస్ ఉండగా న్యూయార్క్ విశ్వవిద్యాలయ అనుబంధ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో రోమర్ పనిచేస్తున్నారు. గతంలో ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు.
ఇప్పటి కే నోబెల్ శాంతి బహుమతికి నదియా మురాద్, డెనిస్ ముక్వెగె, భౌతిక శాస్త్ర బహుమతికి ఆర్థర్ ఆష్కిన్, జెరార్డ్ మౌరూ, డొనా స్ట్రిక్‌లాండ్, వైద్య శాస్త్ర బహుమతికి జేమ్స్ అలిసన్, తసుకు హొంజో, రసాయన శాస్త్ర బహుమతికి ఫ్రాన్సెస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రెగ్ వింటర్‌లను విజేతలుగా ప్రకటించారు. డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు నోబెల్ బహుమతులను అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి నోబెల్ బహుమతి
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : విలియం నోర్ధాస్, పాల్ రోమర్
ఎందుకు : సృజనాత్మకత, వాతావరణాలను ఆర్థిక వృద్ధికి జోడించినందుకు
మంత్రి లోకేష్‌కు ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషిప్
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషిప్ లభించింది. ఈ మేరకు సింగపూర్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అక్టోబర్ 9న లేఖ రాశారు. డిసెంబర్ చివరి వారంలో మంత్రి లోకేష్‌కు సింగపూర్ ఈ ఫెలోషిప్‌ను ప్రదానం చేయనున్నారు.
సింగపూర్ 6వ అధ్యక్షుడు ఎస్‌ఆర్ నాథన్ పేరుతో ఆయన సేవలను స్మరిస్తూ 2012 నవంబర్‌లో ఈఫెలోషిప్‌ను సింగపూర్ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో వినూత్న ఆలోచనలు, పాలనలో టెక్నాలజీ వినియోగం, ప్రజలకు మెరుగైన సదుపాయాలలు కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోని ఇతర దేశాల నాయకులకు సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషిప్‌ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ ఫెలోషిప్ అందుకున్న వారిలో వియత్నాం ఉపప్రధాని వూ వాన్ నిన్, గవర్నర్ ఆఫ్ జెజు ప్రోవెన్స్ వోన్ హీ రైయాంగ్ ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎస్‌ఆర్ నాథన్ ఫెలోషిప్
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్
సీఎం చంద్రబాబుకు అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవార్డు లభించింది. ఈ మేరకు చంద్రబాబును ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు డాక్టర్ స్వామినాథన్ కమిటీ అక్టోబర్ 8న ప్రకటించింది. ఢిల్లీలో అక్టోబర్ 24న జరిగే కార్యక్రమంలో కేంద్ర హోంశాఖమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చంద్రబాబుకు ఈ అవార్డును అందజేయనున్నారు.
వ్యవసాయ విధానం, రైతులకు ప్రోత్సాహాలు, పరిశోధన, పంటల అభివృద్ధి, నాయకత్వం, సాగునీరు, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటెంగ్ వంటి అంశాలను ఆధారంగా ఈ అవార్డుకు చంద్రబాబును స్వామినాథన్ కమిటీ ఎంపిక చేసింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గ్లోబల్ అగ్రికల్చర్ లీడర్ షిప్ అవారు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
జీహెచ్‌ఎంసీకి జాతీయ పర్యాటక పురస్కారం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి 2016-17 ఏడాదికిగాను జాతీయ పర్యాటక పురస్కారం లభించింది. ఈ మేరకు ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని పర్యాటకాభివృద్ధికి దోహదపడుతున్న రాష్ట్రాలకు, కార్పొరేషన్లకు, స్వచ్ఛంద సంస్థలకు ఢిల్లీలో సెప్టెంబర్ 27న కేంద్ర పర్యాటక శాఖ అవార్డులు ప్రదానం చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఉత్తమ పౌరసేవలకు గుర్తింపు ఈ పురస్కారం దక్కింది. అలాగే రాష్ట్ర పర్యాటక శాఖ, దక్షిణ మధ్య రైల్వే, అపోలో హెల్త్ సిటీలకు కూడా అవార్డులు లభించాయి.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పర్యాటక పురస్కారం 2016-17
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
ఎందుకు : పర్యాటక ప్రదేశాల్లో ఉత్తమ సేవులు అందించినందుకు
సదరన్ ట్రావెల్స్‌కు ఏపీ టూరిజం అవార్డు
ట్రావెల్ కంపెనీ సదరన్ ట్రావెల్స్‌కు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు-2018 సెప్టెంబర్ 28న లభించింది. 2017లో కూడా ఈ అవార్డును సదరన్ ట్రావెల్స్ సొంతం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనమిదిసార్లు బెస్ట్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్ అవార్డును దక్కించుకున్న సదరన్ ట్రావెల్స్... దేశ విదేశాల్లోని పుణ్య క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలకు టూర్లను నిర్వహిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు-2018
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : సదరన్ ట్రావెల్స్
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
స్వాతి లక్రాకు డాటర్స్ ఇండియా అవార్డు
తెలంగాణ పోలీస్ శాఖలో మహిళా భద్రత విభాగం ఐజీగా సేవలందిస్తున్న ఐపీఎస్ స్వాతిలక్రాకు ప్రతిష్టాత్మకమైన డాటర్స్ ఇండియా అవార్డు లభించింది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో సెప్టెంబర్ 28న జరిగిన 4వ హెల్త్‌కేర్ సదస్సులో ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కాళీచరణ్ ఈ అవార్డును అందజేశారు. ప్రతి ఏటా సేవ్‌గర్ల్, ఉమెన్ ఎంపవర్‌మెంట్ కేటగిరీల్లో దేశవ్యాప్తంగా కృషిచేస్తున్న సామాజిక వేత్తలకు, అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తోంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : డాటర్స్ ఇండియా అవార్డు
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : స్వాతిలక్రా
ఎక్కడ : జైపూర్, రాజస్థాన్
డాక్టర్ శ్రీధర్‌రెడ్డికి డెంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
విజయవాడకు చెందిన ప్రముఖ దంత వైద్య నిపుణుడు డాక్టర్ ఎ.శ్రీధర్‌రెడ్డికి అవుట్‌స్టాండింగ్ డెంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. దుబాయ్‌లో జరుగుతున్న ప్రపంచ దంత వైద్యుల సదస్సులో అక్టోబర్ 1న డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మజుందార్, గల్ఫ్ మెడికల్ యూనివర్శిటీ ప్రతినిధి డాక్టర్ దుసాన్ సార్ధిలోవిక్ ఈ అవార్డును అందజేశారు. అత్యున్నత ప్రమాణాలతో దంత వైద్య సేవలు అందించినందుకుగాను శ్రీధర్‌రెడ్డికి ఈ అవార్డు ద క్కింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అవుట్‌స్టాండింగ్ డెంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : డాక్టర్ ఎ.శ్రీధర్‌రెడ్డి
ఎక్కడ : దుబాయ్, యునెటైడ్ అరబ్ ఎమిరెట్స్
ఎందుకు : అత్యున్నత ప్రమాణాలతో దంత వైద్య సేవలు అందించినందుకు
ఇద్దరు శాస్త్రజ్ఞులకు నోబెల్ వైద్య బహుమతి
ప్రాణాంతక వ్యాధి కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులు నోబెల్ వైద్య బహుమతికి ఎంపికయ్యారు. వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్ అలిసన్ (70), జపాన్‌కు చెందిన తసుకు హొంజో (76)లను ఈ బహుమతికి ఎంపిక చేసినట్లు స్వీడీష్ అకాడమి అక్టోబర్ 1న ప్రకటించింది. ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు.
వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని అలిసన్, హొంజో అభివృద్ధి చేశారు. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఆ మొత్తాన్ని అలిసన్, హొంజోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు కార్ల్-16 వీరికి బహుమతిని అందజేస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : నోబెల్ వైద్య బహుమతి
ఎప్పుడు : అక్టోబర్ 1
ఎవరు : జేమ్స్ అలిసన్, తసుకు హొంజో
ఎందుకు : కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినందుకు
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్
భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభించింది. అమెరికా శాస్త్రజ్ఞుడు ఆర్థర్ ఆష్కిన్ (96), ఫ్రాన్స్ కు చెందిన జెరార్డ్ మోరో (74), కెనడా శాస్త్రజ్ఞురాలు డొనా స్ట్రిక్‌లాండ్ (59) నోబెల్ భౌతిక శాస్త్ర బహుమతి-2018 కి ఎంపికైన ట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 2న ప్రకటించింది. ఆప్టికల్ లేజర్‌లపై పరిశోధనలు చేసి కంటి శస్త్రచికిత్సల్లో అధునాతన పరికరాలను ఉపయోగించేందుకు దోహదపడినందుకు వీరికి నోబెల్ బహుమతి దక్కింది.
భౌతిక శాస్త్ర నోబెల్‌ను తొలిసారిగా 1901లో ప్రవేశపెట్టగా అప్పటి నుంచి ఈ బహుమతి అందుకున్న మూడో మహిళ, 55 ఏళ్లలో తొలి మహిళగా డొనా స్ట్రిక్‌లాండ్ గుర్తింపు పొందింది. అలాగే నోబెల్ బహుమతి పొందిన అత్యంత పెద్ద వయస్కుడిగా ఆర్థర్ ఆష్కిన్ (96) నిలిచారు. 2007లో అమెరికా ఆర్థికవేత్త లియోనిడ్ హర్విచ్ తనకు 90 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి పొందారు. బహుమతి మొత్తం విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఇందులో సగాన్ని ఆర్థర్ ఆష్కిన్‌కు, మిగిలిన సగాన్ని మళ్లీ రెండు సమ భాగాలుగా చేసి జెరార్డ్ మోరో, డొనా స్ట్రిక్‌లాండ్‌లకు ఇవ్వనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబె ల్ భౌతికశాస్త్ర బహుమతి
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్
గాంధీకి ‘కాంగ్రెషనల్ గోల్డ్‌మెడల్’
భారత జాతిపిత మోహన్‌దాస్ గాంధీకి అమెరికా అత్యన్నత పౌర పురస్కారం ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ను ఇవ్వనున్నారు. ఈ మేరకు మహాత్ముని స్ఫూర్తిదాయక జీవితానికి గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారాన్ని ఇవ్వనున్నట్లు అక్టోబర్ 2న అమెరికా కాంగ్రెస్ ప్రకటించింది. ప్రపంచశాంతికి మహాత్ముని బోధనల స్ఫూర్తిని, శాంతి, అహింసలను పాటించిన గాంధీ గొప్పదనాన్ని గుర్తిస్తూ.. ప్రతిష్టాత్మక ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’ ఇవ్వాలంటూ అమెరికా హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌సలో తీర్మానం ప్రవేశపెట్టారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహాత్మ గాంధీకి ‘కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్’
ఎప్పుడు : అక్టోబర్ 2
ఎవరు : అమెరికా
ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్రంలో నోబెల్
జీవ పరిణామ సిద్ధాంతం ఆధారంగా పరిశోధనలు సాగించిన ముగ్గురు శాస్త్రవేత్తలకు 2018 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈ మేరకు ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్(అమెరికా), జార్జ్ స్మిత్(అమెరికా), గ్రెగరీ వింటర్(బ్రిటన్)లు ఈ పురస్కారానికి ఎంపికైనట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సెన్సైస్ అక్టోబర్ 3న ప్రకటించింది.
జీవ ఇంధనాల నుంచి ఔషధాల వరకు మానవాళికి ఉపయోగపడే పదార్థాల తయారీకి దోహదపడే ఎంజైమ్‌లను వీరు జీవ పరిణామ సిద్ధాంతం ప్రాతిపదికగా సృష్టించారు. రసాయన శాస్త్రంలో నోబెల్ పొందిన 5వ మహిళగా ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్ గుర్తింపు పొందారు. సుమారు రూ.7.40 కోట్ల ప్రైజ్‌మనీని ఆర్నాల్డ్ సగం..స్మిత్, వింటర్‌లు మిగతా సగాన్ని పంచుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ముగ్గురు శాస్త్రవేత్తలకు రసాయన శాస్త్ర నోబెల్ బహుమతి
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఫ్రాన్సిస్ ఆర్నాల్డ్, జార్జ్ స్మిత్, గ్రెగరీ వింటర్
ప్రధాని మోదీకి ‘చాంపియన్ ఆఫ్ ది ఎర్త్’
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఐక్యరాజ్యసమితి (ఐరాస) అందించే అత్యున్నత పర్యావరణ పురస్కారం ‘చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ అవార్డు లభించింది. ఈ మేరకు న్యూఢిల్లీలో అక్టోబర్ 3న జరిగిన కార్యక్రమంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఈ అవార్డును అందజేశారు. అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ-ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్) ఏర్పాటులో కీలకపాత్ర పోషించినందుకుగాను మోదీతోపాటు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌కు సంయుక్తంగా ఈ అవార్డును ఐరాస ప్రకటించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : చాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారం
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్
ఎందుకు : అంతర్జాతీయ సౌర కూటమి ఏర్పాటుకు కృషి చేసినందుకు

Published date : 24 Oct 2018 03:42PM