Skip to main content

Ajit Agarkar: బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్‌గా అజిత్ అగార్క‌ర్‌... ఒక్క‌సారిగా జీతం భారీగా పెంపు

టీమ్ ఇండియా మాజీ ఆల్‌రౌండర్‌ అజిత్‌ అగార్కర్‌కు సెలక్షన్ కమిటీ చీఫ్‌ పదవి దక్కింది. వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు విసృతంగా వినిపించినప్పటికీ.. అనూహ్యంగా అజిత్‌ అగార్కర్‌ రేసులోకి వచ్చాడు. అతడిని చీఫ్‌ సెలక్టర్‌గా బీసీసీఐ ప్రకటించడం చకచకా జరిగిపోయాయి.
Ajit Agarkar
బీసీసీఐ చీఫ్ సెలెక్ట‌ర్‌గా అజిత్ అగార్క‌ర్‌... ఒక్క‌సారిగా జీతం భారీగా పెంపు

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు జట్టును అగార్కర్‌ నేతృత్వంలోని కమిటీనే ప్రకటించాల్సి ఉంది. ఆసియా కప్‌, వన్డే ప్రపంచ కప్‌ వంటి టోర్నీలు ఉన్న నేపథ్యంలో కీలమైన పోస్టుకు అగార్కర్‌ను ఎంపిక చేయ‌డం విశేషం. రాబోయే కాలంలో వన్డే ప్రపంచ కప్‌తోపాటు టీ20 వరల్డ్‌ కప్‌ జట్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీంతో టీ20లు ఆడిన  అనుభవం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అజిత్‌ పేరును ఆమోదించింది.

Success Story: వ‌రుస‌గా నాలుగు సార్లు ఫెయిల్‌...ఏడేళ్ల నిరీక్ష‌ణ‌.. చివ‌రికి ఐఎఫ్ఎస్ సాధించానిలా...

అగార్కర్‌ గతంలో ముంబయి జట్టుకు చీఫ్‌ సెలక్టర్‌గా పని చేశాడు. ఐపీఎల్‌లో ఢిల్లీకి సహాయక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. అలాగే అగర్కార్‌కు క్రికెట్ విశ్లేషకుడిగా అనుభవం ఉంది. భారత్ తరఫున  మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు, 1,800కిపైగా పరుగులు చేసిన అగార్కర్‌కు అన్ని విభాగాలపై పట్టు ఉంది. 

ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు... ప్రారంభ వేత‌న‌మే రూ.35 వేలు... ఇలా అప్లై చేసుకోండి

చీఫ్ సెలక్టర్‌గా ఎంపికైన అభ్యర్థికి ప్రస్తుతం రూ. కోటి వేతనం ఉంటుంది. అయితే, స్టార్ మాజీ ఆటగాళ్లకు ఇది చాలా తక్కువే. క్రికెట్ విశ్లేషకుడు, వ్యాఖ్యాతగా అంతకంటే ఎక్కువే అగార్కర్‌ సంపాదన ఉంటుంది. దీంతో వేతన ప్యాకేజ్‌ను రూ.3 కోట్లకు పెంచేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు స‌మాచారం.

Published date : 05 Jul 2023 07:06PM

Photo Stories