Face Recognition:ఇండియన్ రైల్వేలో విధ్వంసాన్ని పసిగట్టే వీడియో వ్యవస్థ
ఇటీవల జరిగిన ‘అగ్నిపథ్’ ఆందోళ నలు, రైళ్ల దహనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వేస్టేషన్లలో అధునాతన సీసీటీవీ భద్రతా వ్యవస్థను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకు రానుంది. ఇప్పటివరకు ఉన్న సాధారణ సీసీ కెమెరాల స్థానంలో హైటెక్ కెమెరా లతో కూడిన వీడియో నిఘా వ్యవస్థ–వీఎస్‌ఎస్ (సీసీటీవీ కెమెరాల నెట్‌వర్క్)ను ఏర్పాటు చేయనుంది. కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో పనిచేసే వీడియో విశ్లేషణ సాఫ్ట్‌వేర్‌తోపాటు స్టేషన్ల ఆవరణ లోకి పాత నేరస్తులు ప్రవే శించిన వెంటనే గుర్తించి అధికారులను అప్రమత్తం చేయగల ముఖాల గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) సాఫ్ట్ వేర్‌ను వినియోగించనుంది. అలాగే రైల్వే సిబ్బంది ఏ ప్రాంతంలో ఉన్న వెబ్ బ్రౌజర్ నుంచైనా స్టేషన్లలోని సీసీ కెమె రాలు, సర్వర్, యూపీఎస్, స్విచ్‌లను వీక్షిస్తూ పర్యవేక్షించేలా నెట్‌వర్క్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను వాడనుంది. తొలి దశలో భాగంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని 76 స్టేషన్లు సహా దేశవ్యాప్తంగా 756 స్టేషన్లను వీడియో నిఘా వ్యవస్థ కోసం ఎంపిక చేసింది. ఇందులో తెలంగాణకు సంబంధించి 39 స్టేషన్లు ఉన్నాయి. రైల్వే అనుబంధ సంస్థ రైల్‌టెల్ ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటు పనులు జరగను న్నాయి. మలి దశల్లో ఇతర స్టేషన్ లలో హైటెక్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ‘నిర్భయ నిధుల’తో చేపడుతున్న ఈ ప్రాజెక్టును 2023 జనవరి లోగా పూర్తి చేసే అవకాశం ఉందని రైల్‌టెల్ జూలై 6న ఓ ప్రకటనలో తెలిపింది.
also read: Army Recruitment: ఏఏ దేశాల్లో సైనిక నియామకాలు ఎలా ఉన్నాయంటే..?