Hypersonic Missile: జిక్రోన్ క్రూయిజ్ క్షిపణులను పరీక్షించిన దేశం?
రష్యా మొట్టమొదటి సారిగా ఓ అణు జలాంతర్గామి నుంచి హైపర్‌సోనిక్ క్షిపణులను పరీక్షించింది. మొత్తం రెండు జిక్రోన్ క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ అక్టోబర్ 4న తెలిపింది. అవి బారెంట్స్ సముద్రంలోని మాక్ లక్ష్యాలను ఛేదించాయని పేర్కొంది. రెండు క్షిపణుల్లో ఒక దాన్ని భూతలం నుంచి మరోదాన్ని తెల్ల సముద్రంలో నీటిలో నుంచి పరీక్షించినట్లు వెల్లడించింది. జిక్రోన్ క్షిపణి ధ్వని కంటే 9 రెట్లు వేగంతో ప్రయాణించగలదని, 1000 కిలోమీటర్ల రేంజ్ ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. 2021 ఏడాదిలోగా మరికొన్ని పరీక్షలు జరిపి, 2022లో రష్యన్ నేవీలో చేరుస్తామన్నారు. ఈ క్షిపణులు రష్యా రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూరుస్తాయని పేర్కొన్నారు.
కోవిడ్ మరణాలను తగ్గిస్తున్నాయి..
బ్లడ్ థిన్నర్లు (రక్తాన్ని పలుచగా చేసే మందులు) కోవిడ్ మరణాలను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తాజా పరిశోధనలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు లాన్సెట్ ఈ–క్లినికల్ మెడిసిస్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అమెరికాలోని 60 ఆస్పత్రుల్లో 2020 మార్చి 4 నుంచి ఆగస్టు 27 వరకు, 6,195 మంది రోగులపై జరిపిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. అమెరికాలోని మిన్నెసోటా యూనివర్సిటీ, స్విట్జర్లాండ్‌లోని బాసెల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు దాదాపు 90 రోజలు పాటు యాంటీ కోయాగ్యులేషన్ థెరపీ ఇచ్చి ఈ వివరాలను సేకరించారు.
చదవండి: హెచ్‌పీవీ టీకా గార్డ్‌సిల్9ను అభివృద్ధి చేసిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : రెండు జిక్రోన్ క్రూయిజ్ క్షిపణుల పరీక్ష విజయవంతం
ఎప్పుడు : అక్టోబర్ 4
ఎవరు : రష్యా రక్షణ శాఖ
ఎక్కడ : తెల్ల సముద్రం
ఎందుకు : రష్యా రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్