Covid-19: రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం: ఇన్సకాగ్
మానవ శరీరంలో ఇమ్యూనిటీ(రోగనిరోధకత)ను తప్పించుకుపోయే శక్తి సామర్థ్యాలు ఒమిక్రాన్ వేరియంట్‌కు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం దీని వల్ల కలిగే అనారోగ్య తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయ డేటా ఆధారంగా ఇన్సకాగ్(ఐఎన్‌ఎస్‌ఏసీఓజీ– ఇండియన్ సార్స్ కోవిడ్2 జీనోమిక్స్ కన్సోర్టియమ్) ఈ అంచనాలను తన తాజా బులిటెన్‌లో ప్రకటించింది. భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి, తీవ్రత పర్యవేక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇప్పటికీ ప్రపంచంలో డెల్టానే ఆధిపత్య వీఓసీ (వేరియంట్ ఆఫ్ కన్సెర్న్)అని, కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమించిందని వెల్లడించింది. యూకే తదితర ప్రాంతాల్లో ఆధిపత్య వీఓసీ దిశగా ఒమిక్రాన్ దూసుకుపోతున్నట్లు తెలిపింది. అంతర్జాతీయంగా లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోందని పేర్కొంది.
ఏ టీకా ప్రభావమెంత!
భారత్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో అత్యధికంగా వాడుతున్న కోవిషీల్డ్ ఒమిక్రాన్ కారణంగా తీవ్ర అనారోగ్యం (ఆసుపత్రి పాలయ్యే, మరణించే) పాలయ్యే అవకాశాలను బాగా తగ్గిస్తుంది. కోవిషీల్డ్ సామర్థ్యం 71% (ఏ మేరకు ప్రభావవంతం అనేది) అని వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (ఐహెచ్‌ఎంఈ) గణాంకాలు చెబుతున్నాయి. డెల్టా, ఒమిక్రాన్ వేరియెంట్లపై ఏయే టీకా ఎంత ప్రభావ వంతంగా పనిచేస్తుందనేది పట్టికలో చూడొచ్చు.
చదవండి: కరోనానంతర సమస్యలకు లీ హెల్త్ రూపొందించిన ఔషధం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్