Skip to main content

Inter Continental Ballistic Missile: బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసాంగ్‌–17ను పరీక్షించిన దేశం?

Hwasong-17

North Korea launches largest inter continental ballistic missile Hwasong-17: అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసాంగ్‌–17ను విజయవంతంగా పరీక్షించినట్టు ఉత్తర కొరియా మార్చి 25న ప్రకటించింది. ఇది 67 నిమిషాల పాటు ప్రయాణించి 1,090 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉత్తర కొరియా, జపాన్‌ మధ్య సముద్ర జలాల్లో లక్ష్యంపై పడిందని కొరియన్‌ సెంట్రల్‌ న్యూస్‌ఏజెన్సీ (కేసీఎన్‌ఏ) వెల్లడించింది. 2022 ఏడాది ఉత్తర కొరియా ఇలాంటి పరీక్షలు జరపడం ఇది 12వసారి.

Most Powerful Missiles: హైపర్‌ సోనిక్‌ మిసైల్‌ కింజల్‌ పరిధి ఎన్ని కిలోమీటర్లు?

మారియుపోల్‌ నగరం ఏ దేశంలో ఉంది?
ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. మార్చి 16న ఉక్రెయిన్‌లోని మారియుపోల్‌లో 1,300 మందికి పైగా తలదాచుకున్న ఓ థియేటర్‌ రష్యా బాంబు దాడిలో నేలమట్టమవడం తెలిసిందే. వారిలో కనీసం 300 మందికి పైగా దుర్మరణం పాలైనట్టు తాజాగా తేలింది. కీవ్‌ సమీపంలో ఉక్రెయిన్‌ దళాలకు ఇంధనం సరఫరా చేసే ఓ భారీ ఇంధనాగారాన్ని ధ్వంసం చేసినట్టు రష్యా తాజాగా ప్రకటించింది.

చర్చల్లో పురోగతి: టర్కీ
రష్యా–ఉక్రెయిన్‌ మధ్య చర్చల్లో పురోగతి ఉందని టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌ చెప్పారు.  ‘‘నాటోలో చేర్చుకోవాలన్న డిమాండ్‌ను వదులుకునేందుకు, రష్యన్‌ను అధికార భాషగా స్వీకరించేందుకు ఉక్రెయిన్‌ సిద్ధంగా ఉంది.’’ అని చెప్పారు.

NSIL: న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్‌తో కీలక ఒప్పందం చేసుకున్న సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అతి పెద్ద ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసాంగ్‌–17ను విజయవంతంగా పరీక్షించిన దేశం?
ఎప్పుడు : మార్చి 25
ఎవరు    : ఉత్తర కొరియా
ఎక్కడ    : ఉత్తర కొరియా
ఎందుకు : ఉత్తర కొరియా సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 26 Mar 2022 05:32PM

Photo Stories