Skip to main content

Cancer: క్యాన్సర్‌పై పోరుకు కొత్త అస్త్రం

క్యాన్సర్‌పై సమర్థంగా పోరాడే వినూత్న ఇమ్యునోథెరపీని అమెరికా పరిశోధకులు అభివృద్ధి చేశారు.
A new weapon in the fight against cancer

ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌ వైద్యకళాశాల పరిశోధకులు రూపొందిస్తున్న కొత్త చికిత్సా విధానంలో నేచురల్‌ కిల్లర్‌(ఎన్‌ .కె.) కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇంతవరకూ క్యాన్సర్‌పై పోరుకు ఉపయోగిస్తున్న టి కణాల కంటే ఈ ఎన్‌ .కె.కణాలే శక్తిమంతమైనవని శాస్త్రవేత్తలు తేల్చారు. క్యాన్సర్‌ కణాల్లోని పీవీఆర్‌ అనే ప్రోటీన్‌ టీ, ఎన్‌ .కె.కణాలు క్యాన్సర్‌ను నిర్మూలించకుండా అడ్డుపడుతోంది. ఎన్‌ .కె.కణాల్లోని కేఐఆర్‌2డీఎల్‌5 అనే పదార్థానికి పీవీఆర్‌ అతుక్కోవడంతో ఆ కణాలు నిర్వీర్యమవుతున్నాయి. దీంతో కేఐఆర్‌2డీఎల్‌5, పీవీఆర్‌ల బంధాన్ని ఛేదించే మోనోక్లోనల్‌ యాంటీబాడీని పరిశోధకులు కనిపెట్టారు.

చదవండి: Weekly Current Affairs (Science & Technology) Bitbank: 'చంద్రయాన్-3'ని ఏ సంవత్సరంలో ప్రయోగించాలని ఇస్రో ప్లాన్ చేస్తోంది? 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 02 Dec 2022 04:58PM

Photo Stories