Skip to main content

Electric Air Taxi: ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై ప్రయోగాలు చేస్తోన్న సంస్థ?

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా... ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీలపై ప్రయోగాలు ప్రారంభించింది. తాజాగా జోబీ ఏవియేషన్‌తో కలిసి ‘‘ఆల్‌ ఎలక్ట్రిక్‌ వెర్టికల్‌ టేక్‌ఆఫ్‌ అండ్‌ లాండింగ్‌(ఇవీటీఓఎల్‌) ఎయిర్‌క్రాఫ్ట్‌’’లపై ప్రయోగాలు ఆరంభించింది.
Electric Air Taxi

 టేకాఫ్‌ అవసరం లేకుండా గాల్లోకి నేరుగా ఎగరే, లాండయ్యే విమానం, అది కూడా కరెంటుతో నడిచేదాన్ని ఇవీటీఓఎల్‌ అంటారు. ప్రయోగాలు సఫలమైతే త్వరలో ఎయిర్‌టాక్సీలు అమెరికన్లకు అందుబాటులోకి వస్తాయి. వేగవంతమైన రవాణాకు ఈ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.

ఇవీటీఓఎల్‌ వాహనాలపై నాసా ప్రయోగాలు చేయడం ఇదే తొలిసారి. ఏఏఎం(అడ్వాన్డ్స్‌ ఎయిర్‌ మొబిలిటీ) నేషనల్‌ కాంపైన్‌లో భాగంగా ఈ వాహనాలపై నాసా ప్రయోగాలు ఆరంభించింది. జోబీకి చెందిన ఎలక్ట్రిక్‌ ఎయిర్‌బేస్‌ కాలిఫోర్నియాలో ఉంది. దీనిలో నాసా ప్రయోగాలు జరుపుతోంది. ఇప్పటికే జోబీ తయారుచేసిన ఇవీటీఓఎల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ పనితీరును ప్రస్తుతం నాసా మదింపు చేస్తోంది.
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : జోబీ ఏవియేషన్‌తో కలిసి ఎలక్ట్రికల్‌ ఎయిర్‌ టాక్సీ ‘‘ఇవీటీఓఎల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’’లపై ప్రయోగాలు ప్రారంభించిన సంస్థ?
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 4
ఎవరు    : అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ 
ఎక్కడ    : జోబీ ఎలక్ట్రిక్‌ ఎయిర్‌బేస్, కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : వేగవంతమైన రవాణా కోసం...
 

Published date : 07 Sep 2021 03:16PM

Photo Stories