Skip to main content

PSLV-C 55: పీఎస్‌ఎల్‌వీ-సీ55 రాకెట్ ప్రయోగం విజ‌య‌వంతం

తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్‌(సతీష్‌ ధావన్‌ స్పేస్‌సెంటర్‌) నుంచి ఏప్రిల్ 22న ఇస్రో ప్ర‌యోగించి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్ విజయవంతమైంది.
 PSLV C55

వాహననౌక రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్‌ ప్రయోగం కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ పర్యవేక్షించారు. శాటిలైట్స్ 20.35 నిమిషాల ప్రయాణం అనంత‌రం కక్ష్యలోకి ప్రవేశించాయి. 
ఈ ప్రయోగంలో పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్‌ సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్‌-2, 16 కేజీల బరువు ఉన్న లూమిలైట్‌-4 ఉపగ్రహాంను సన్‌ సింక్రనస్‌ ఆర్బిట్‌(సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి ప్రవేశట్టింది. ఈ రాకెట్ 44.4 మీటర్ల పొడవు, 228 టన్నుల బరువు క‌లిగి ఉంది. సముద్ర భద్రతను పెంచడం కోసం లూమిలైట్‌ను ప్రవేశపెట్టింది సింగపూర్‌.
ఉపగ్రహాలను నిర్ణీతీ కక్ష్యలోకి వదిలేసిన తర్వాత ఆరిస్‌-2, పైలెట్‌, ఆర్కా-200, స్టార్‌బెర్రీ, డీఎస్‌వోఎల్‌, డీఎస్‌వోడీ-3యూ, డీఎస్‌వోడీ-06 అనే చిన్నపాటి పేలోడ్లను సైతం ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ తరహా ప్రయోగం ఇక్కడ జరగడం ఇదే తొలిసారని ఇస్రో చైర్మన్‌ సోమనాథ్ అన్నారు. ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా, ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమన్నారు.

Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్.. ఎవరీమె..?

Published date : 22 Apr 2023 04:13PM

Photo Stories