ISRO: పీఎస్‌ఎల్‌వీ సీ–52 ద్వారా ఏ ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2022, ఏడాది ప్రథమార్థంలో పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగానికి, ద్వితీయార్థంలో చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. 2022, ఏడాదిలో 7 రాకెట్ ప్రయోగాలు చేయాలని, చంద్రయాన్–3, గగన్‌యాన్–1 ప్రయోగాలకు సంబంధించి 4 రాకెట్లను ప్రయోగాత్మకంగా చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. 2022 ఏడాది.. జనవరి 20, ఫిబ్రవరి 4న చేయాలనుకున్న పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగాన్ని.. 2022, ఫిబ్రవరి 14న నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగంలో ఆర్‌ఐశాట్–1ఏ, ఐఎన్‌ఎస్–2డీ అనే 2 ఉపగ్రహాలను రోదసిలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఎవరు ఉన్నారు?
చంద్రయాన్–2లో నేర్చుకున్న పాఠాలు జాతీయస్థాయి నిపుణుల సూచనల ఆధారంగా చంద్రయాన్–3 ప్రాజెక్టుకు ఇస్రో సిద్ధమవుతోంది. చంద్రుడిపై పరిశోధనలు జరిపేందుకు ఉద్దేశించిన చంద్రయాన్–2 ప్రయోగంలో ల్యాండర్, రోవర్ దించే ప్రయత్నంలో భాగంగా ఆఖరి 2 నిమిషాల్లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని గుద్దుకుని విఫలమైన విషయం తెలిసిందే. అందుకే ఈసారి ల్యాండర్, రోవర్‌ను చంద్రయాన్–3 ప్రయోగంలో మరోమారు పంపించే ఏర్పాట్లను శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఇప్పటికే ల్యాండర్‌లకు సంబంధించి హార్డ్‌వేర్ రూపకల్పన పూర్తయిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ బెంగళూరులో ప్రకటించారు. చంద్రయాన్–3 ప్రయోగాన్ని 2022, ఆగస్టులో నిర్వహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
చదవండి: కొత్తరకం కరోనా వైరస్ నియోకోవ్‌ను ఎక్కడ గుర్తించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2022, ఫిబ్రవరి 14న, పీఎస్‌ఎల్‌వీ సీ–52 ప్రయోగం నిర్వహించేందుకు సన్నాహాలు
ఎప్పుడు : ఫిబ్రవరి 4
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)
ఎందుకు : ఆర్‌ఐశాట్–1ఏ, ఐఎన్‌ఎస్–2డీ అనే 2 ఉపగ్రహాలను రోదసిలోకి పంపేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్