Skip to main content

Ballistic Missile: బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన అరిహంత్‌

INS Arihant launches Submarine Launched Ballistic Missile

రక్షణ రంగంలో భారత్‌ మరో కీలక మైలురాయిని అధిగమించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన అణు జలాంతర్గామి ఐఎన్‌ ఎస్‌ అరిహంత్‌ తన ఆయుధ ప్రయోగ సామర్థ్యాన్ని చాటింది. మొదటిసారిగా ఒక బాలిస్టిక్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించింది. అది అత్యంత కచ్చితత్వంతో బంగాళాఖాతంలో నిర్దేశిత లక్ష్యాన్ని తాకింది. ఈ ప్రయోగంలో క్షిపణికి సంబంధించిన సాంకేతిక అంశాలను పరిశీలించామని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. భారత వ్యూహాత్మక దాడి సామర్థ్యాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అణుశక్తితో నడిచే బాలిస్టిక్‌ క్షిపణి జలాంతర్గామి(ఎస్‌ఎస్‌బీఎన్‌) కార్యక్రమం కింద ఐఎన్‌ ఎస్‌ అరిహంత్‌ను భారత్‌ అభివృద్ధి చేసింది.

October Weekly Current Affairs (Science & Technology) Bitbank: What is India’s rank in the Global Innovation Index Ranking?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 28 Oct 2022 04:57PM

Photo Stories