Indian Coast Guard Ship: అధునాతన నౌక ఐసీజీఎస్ విగ్రహను తయారు చేసిన సంస్థ?
Sakshi Education
భారతతీర గస్తీ దళం అమ్ముల పొదిలో చేరిన అధునాతన నౌక ‘‘ఐసీజీఎస్ విగ్రహ’’ విశాఖ కేంద్రంగా సేవలందించేందుకు సిద్ధమైంది.
అడ్వాన్స్‌డ్ ఫైర్ పవర్‌తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన విగ్రహ నౌకని 2021, ఆగస్టు 28న చెన్నైలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జాతికి అంకితం చేశారు. అనంతరం కోస్ట్‌గార్డు ఈస్ట్రన్ సీబోర్డు ప్రధాన స్థావరమైన విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు సెప్టెంబర్ 10న విశాఖకు చేరుకుంది.
ఐసీజీఎస్ విగ్రహ విశేషాలు...
- ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసల్ సిరీస్‌లో ఏడో నౌక అయిన దీనిని చెన్నైలోని ఎల్ అండ్ టీ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ సంస్థ తయారుచేసింది.
- 98 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 3.6 మీటర్ల డ్రాట్, 2,200 టన్నుల బరువుతో తయారైంది.
- 9,100 కిలోవాట్స్ డీజిల్ సామర్థ్యం ఉన్న రెండు ఇంజిన్లతో 26 నాటికల్ మైళ్ల వేగంతో 5 వేల కి.మీ ప్రయాణించగల సామర్థ్యం విగ్రహ సొంతం.
- అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాడార్లు, నేవిగేషన్, కమ్యూనికేషన్ పరికరాలు, సెన్సార్లు, సముద్ర స్థితిగతులకు అనుగుణంగా దిశ మార్చుకునే యంత్ర సామర్థ్యంతో దీనిని రూపొందించారు.
- రెస్క్యూ ఆపరేషన్లకు ఉపయోగపడేలా ఒక ట్విన్ ఇంజిన్ హెలికాఫ్టర్, నాలుగు హైస్పీడ్ బోట్లను తీసుకెళ్లగలదు.
- షిప్‌లో 12 మంది అధికారులు, 90 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. తొలి కమాండెంట్‌గా పీఎన్ అనూప్‌కు బాధ్యతలు అప్పగించారు.
- ఐసీజీఎస్ విగ్రహ చేరికతో కోస్ట్‌గార్డ్ జాబితాలో 157 నౌకలు, 66 విమానాలున్నాయి.
చదవండి: దేశంలో తొలుత నిఫా వైరస్‌ను ఏ నగరంలో గుర్తించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : విశాఖ తీరానికి చేరుకున్న అధునాతన నౌక?
ఎప్పుడు : సెప్టెంబర్ 10
ఎవరు : ఐసీజీఎస్ విగ్రహ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : విశాఖ నుంచి కార్యకలాపాలు నిర్వర్తించేందుకు...
Published date : 14 Sep 2021 05:41PM