Skip to main content

Mk-1A Tanks: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?

MK 1a Tank

భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు రూ.7,523 కోట్లతో అర్జున్‌ ఎంకే–1ఏ రకం 118 యుద్ధ ట్యాంకులను కొత్తగా కొనుగోలు చేయాలని భారత రక్షణ శాఖ నిర్ణయించింది. వీటి కొనుగోలు కోసం తమిళనాడు రాష్ట్రం చెన్నై నగర శివారు ఆవడిలో ఉన్న హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్‌)కు ఆర్డర్‌ ఇచ్చినట్లు సెప్టెంబర్‌ 23న రక్షణ శాఖ తెలిపింది. వేగంగా కదలడం, మెరుగైన నిఘా సామర్థ్యం, పేలుడు శక్తి తదితర 72 ఆధునీకరించిన ప్రత్యేకతలు కలిగిన దేశీయ అర్జున్‌ ట్యాంక్‌ ఆధునిక రూపమే ఏంకే–1ఏ. ఈ ట్యాంకులు అన్ని వేళల్లో, అన్ని రకాలైన ప్రాంతాల్లో కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించగలవు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)కి చెందిన ల్యాబోరేటరీ... కంబాట్‌ వెహికల్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌(సీవీఆర్‌డీఈ) ఎంకే–1ఏ రకం ట్యాంకులను డిజైన్‌ చేసింది.

చ‌ద‌వండి: స్వదేశీ పరిజ్ఞానంతో సూడో శాటిలైట్‌ను రూపొందించనున్న సంస్థ?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
రూ.7,523 కోట్లతో అర్జున్‌ ఎంకే–1ఏ రకం 118 యుద్ధ ట్యాంకులను కొనుగోలు చేసేందుకు హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీ(హెచ్‌వీఎఫ్‌)కు ఆర్డర్‌
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 23
ఎవరు    : భారత రక్షణ శాఖ
ఎక్కడ    : ఆవడి, చెన్నై, తమిళనాడు
ఎందుకు  : భారత సైన్యం పోరాట సామర్థ్యాన్ని పెంచేందుకు...

Published date : 24 Sep 2021 05:18PM

Photo Stories