Google will delete Gmail: జీమెయిల్, యూట్యూబ్ యూజర్లకు అలర్ట్
మనలో చాలా మందికి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది. కొంత మంది అవసరంకొద్దీ రెండు.. మూడు.. ఇలా లెక్కకు మించి జీమెయిల్ అకౌంట్లు క్రియేట్ చేస్తుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్లను ఒకసారి కూడా ఓపెన్ చేయరు. రెండేళ్లకుపైగా ఉపయోగంలో లేని అలాంటి ఇన్‌యాక్టివ్ జీమెయిల్ అకౌంట్లను గూగుల్ త్వరలో డిలీట్ చేయనుంది.
➤☛ ఇదేందయ్య ఇది... చాట్ జీపీటీ చెప్పిందని క్లాస్ మొత్తాన్ని ఫెయిల్ చేసిన ప్రొఫెసర్
ఇన్‌యాక్టివ్ అకౌంట్లకు సంబంధించి గూగుల్ కొత్త విధానాలను ప్రకటించింది. ప్రతి 24 నెలలకు ఒకసారి లాగిన్ అవ్వాలని, పాత గూగుల్ అకౌంట్లను సమీక్షించాలని యూజర్లను కోరింది. రెండు సంవత్సరాలుగా ఆపరేట్ చేయని అకౌంట్లలో స్టోర్ అయిన డేటా డిలీట్ అయ్యేలా ఇప్పటికే గూగుల్ ఒక విధానాన్ని కలిగి ఉంది. కానీ, ఇప్పుడు ఆ డేటా మొత్తాన్ని పూర్తిగా తమ సర్వర్ల నుంచి డిలీట్ చేయనుంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి గూగుల్ అకౌంట్ల కోసం ఇన్‌యాక్టివ్ విధానాన్ని మరో రెండేళ్లకు అప్‌డేట్ చేస్తున్నట్లు గూగుల్ పేర్కొంది.
➤☛ 20 ప్రశ్నలకు అరలీటర్ నీటిని వాడేస్తున్న చాట్ జీపీటీ
కొత్త విధానం డిసెంబర్ 2023 నుంచి అమలులోకి వస్తుందని ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది. జీమెయిల్, డాక్స్, డ్రైవ్, మీట్, క్యాలెండర్, యూట్యూబ్, గూగుల్ ఫోటోస్ సహా ఇనాక్టివ్ అకౌంట్లలో స్టోర్ మొత్తం మొత్తం కంటెంట్ తొలగించనున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు 2020లో ప్రకటించిన విధానం ప్రకారం.. ఇనాపరేటివ్ అంకౌంట్లలోని కంటెంట్‌ను మాత్రమే తొలగించేది. ఇప్పుడు తీసుకొచ్చిన విధానంలో అకౌంట్లను కూడా తొలగించే అవకాశం ఉంది. ఈ విధానం వ్యక్తిగత గూగుల్ అకౌంట్లకు మాత్రమే వర్తిస్తుందని, పాఠశాలలు లేదా వ్యాపార సంస్థల అకౌంట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని గూగుల్ పేర్కొంది.
➤☛ ఉద్యోగాలకు ఎసరు పెట్టిన చాట్ బోట్స్.. నిరుద్యోగులకు ఇక నిద్రలేని రాత్రులే
ఉపయోగంలో లేని అకౌంట్లను గూగుల్ దశలవారీగా తొలగిస్తుంది. మొదటగా డిసెంబర్‌లో ఈ తొలగింపు ప్రక్రియను ప్రారంభించనుంది. అకౌంట్ క్రియేట్ చేసి తర్వాత ఎప్పుడూ ఉపయోగించని అకౌంట్లను తొలి విడతలో తొలగించనుంది. ఇలా తొలగించే ముందు ఆ అకౌంట్లకు, దానికి సంబంధించి పేర్కొన్న రికవరీ అకౌంట్లకు నోటిఫికేషన్లు పంపుతుంది. కాబట్టి మీకు గూగుల్ అకౌంట్ ఉండి తరచూ ఉపయోగించకపోతే వెంటనే యాక్టివేట్ చేసుకోండి.