Gaganyaan: ఎస్–200 బూస్టర్ ప్రయోగాన్ని ఎక్కడ నుంచి నిర్వహించారు?
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ ప్రయోగం విజయవంతమైంది. గగన్‌యాన్–1 ప్రయోగంలో భాగంగా మే 13న శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. 20 మీటర్ల పొడవు, 3.2 మీటర్ల వెడల్పుగల 203 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి దీన్ని ప్రయోగించారు. ఈ స్ట్రాపాన్ బూస్టర్‌ను 135 సెకండ్ల పాటు మండించి సుమారు 700 కిలో మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి ప్రయోగించడంతో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించామని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనా నేపథ్యంలో గగన్‌యాన్ ప్రయోగాన్ని 2023 ఆఖరు నాటికి, లేదా 2024 ప్రథమార్థంలో నిర్వహించే అవకాశం ఉంది.
GK Awards Quiz: 2022 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ (IWOC) అవార్డుకు ఎంపికైనది?Lunar Soil: ఏ దేశ శాస్త్రవేత్తలు.. తొలిసారిగా చంద్రుడి మట్టిలో మొక్కలు పెంచారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్–200 స్ట్రాపాన్ బూస్టర్ ప్రయోగం విజయవంతం
ఎప్పుడు : మే 13
ఎవరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)
ఎక్కడ : సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్(షార్), శ్రీహరికోట, తిరుపతి జిల్లా
ఎందుకు : గగన్‌యాన్–1 ప్రయోగంలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్