C16 Biosciences: ఈస్ట్ కణాలతో వంట నూనె
Sakshi Education
ప్రపంచవ్యాప్తంగా వంట నూనెకు అధిక డిమాండ్ నెలకొంది. కానీ, ఆయిల్‌పామ్ పంటసాగు అందుకు తగినట్టుగా లేకపోవడంతో చాలా దేశాలు వంటనూనె కొరతను ఎదుర్కొంటున్నాయి.
విదేశాల నుంచి దిగుమతి చేసుకొంటున్నాయి. ఈ కొరత తీర్చేందుకు యూఎస్‌లోని న్యూయార్క్‌కు చెందిన సీ16 బయోసైన్సెస్ కంపెనీ ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నది. ప్రయోగశాలలో పరిశోధకులు ఈస్ట్‌కణాలతో పామాయిల్‌ను తయారు చేశారు. ఈ నూనె తయారీకి మెట్షి్నకోవియా పుల్చుర్రిమా లేదా ఎంపీ అనే ప్రత్యేకమైన ఈస్ట్‌జాతిని ఉపయోగించారు. గడ్డి లేదా ఆహార వ్యర్థాలపై ఈస్ట్‌ను పంపడం ద్వారా కేవలం ఏడురోజుల్లోనే పామాయిల్ తయారవుతుంది. అదే ఆయిల్ పామ్‌సాగు పద్ధతిలో పామాయిల్ తయారు చేయాలంటే ఏడేళ్లు పడుతుందని, ప్రపంచ పామాయిల్ కొరత తీర్చేందుకు తమ ఆవిష్కరణ ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొన్నారు.
Published date : 23 Jan 2023 04:26PM