Skip to main content

Dragon-3 Rocket: సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం

చైనా తన సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
China Smart Dragon-3 rocket launches 8 satellites from sea

షాండోంగ్‌ ప్రావిన్స్‌లోని హయియాంగ్‌ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియెలాంగ్‌–3 రాకెట్‌ను ప్రయోగించింది. 

ఇది రెండోసారి..
ఈ ఘన ఇంధన రాకెట్‌ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ఇది రెండోసారి. సముద్రంలోని వేదికల పైనుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసుకుంది. ఓ షిప్‌నే ఇలా రూపుమార్చి మొబైల్‌ లాంచ్‌ పాడ్‌గా తయారు చేసింది. అంతర్జాతీయ జలాల్లో అనువైన స్థానాల నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. 

డ్రోన్‌ యుద్ధ తంత్రం కోసం కొత్త యుద్ధ నౌక 
యుద్ధ నౌకను డ్రోన్లతో మిళితం చేసి అభివృద్ధి పరిచిన కొత్త రకం యుద్ధ నౌకను చైనా నేవీ సోమవారం ప్రారంభించింది. డ్రోన్‌ క్యారియర్‌లా పనిచేస్తూ సైనికులతో అవసరం లేకుండా జరిగే నేలపైనా, నీటిలోనూ పోరాట పటిమను పెంచుతుందని ఓ అధికారి తెలిపారు. 

Satellites: 2024లో అంతరిక్షంలోకి అత్యధిక శాటిలైట్లు పంపిన దేశం ఇదే..

Published date : 15 Jan 2025 01:19PM

Photo Stories