Chandrayaan-3: చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
“ఆగస్టు 23న, చంద్రునిపై చంద్రయాన్-3 దిగడానికి రెండు గంటల ముందు, ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు, చంద్రునిపై పరిస్థితుల ఆధారంగా ఆ సమయంలో దానిని ల్యాండింగ్ చేయడం సముచితమా లేదా అనే దానిపై మేము నిర్ణయం తీసుకుంటాము. ఒకవేళ, ఏదైనా అంశం అనుకూలంగా లేనట్లు అనిపిస్తే, ఆగస్టు 27న మాడ్యూల్‌ను చంద్రుడిపైకి దింపుతాం. ఎలాంటి సమస్య తలెత్తకుంటే ఆగస్ట్ 23న మాడ్యూల్‌ను ల్యాండ్ చేయగలుగుతాం," అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ తెలిపారు.
Chandrayaan-3: చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్–3
సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్‌మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Chandrayaan-3 Moon Images: చంద్రుని ఛాయాచిత్రాలు