Elon Musk: మనిషి మెదడులో బ్రెయిన్ చిప్
Sakshi Education
అమెరికా స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ మనిషి మెదడులో తొలిసారిగా బ్రెయిన్ చిప్‌ను అమర్చి చరిత్ర సృష్టించింది.
ఈ చిప్ ద్వారా మెదడుకు, కంప్యూటర్‌కు నేరుగా అనుసంధానం చేసే దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ మేరకు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు, ఎక్స్ అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జనవరి 30న వెల్లడించారు. ‘మనిషి మెదడులో చిప్ ప్రవేశపెట్టాం. దీని ద్వారా న్యూరాన్ల కదలికలను గుర్తించాం’ అని ఆయన ట్వీట్‌చేశారు. చిప్ అమర్చిన వ్యక్తి వేగంగా కోలుకుంటున్నట్టు, తొలి ఫలితాల్లో స్పష్టమైన ‘న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ ’ను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ చిప్‌నకు ‘ఎన్ 1(లింక్)’గా నామకరణం చేశారు.
Published date : 05 Feb 2024 06:38PM