Blue Origin Company: చంద్రుడిపై ధూళితో సౌర విద్యుత్తు పరికరాలు
Sakshi Education
చంద్రుడిపై ఉండే ధూళిని ఉపయోగించి సోలార్‌సెల్స్, విద్యుత్తు ప్రసార తీగలను తయారు చేసినట్టు అమెరికాకు చెందిన బ్లూ ఆరిజిన్ అనే సంస్థ ప్రకటించింది.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన సంస్థ ఇది. బ్లూ అల్కెమిస్ట్ పేరుతో ‘మాల్టన్ రెగొలిత్ ఎలెక్ట్రోలిసిస్’ అనే ప్రక్రియ ద్వారా సోలాస్‌సెల్స్ తయారుచేసినట్టు సంస్థ తెలిపింది. ఈ ప్రక్రియ ద్వారా అల్యూమినియం, ఇనుము, సిలికాన్ ను సేకరించే అవకాశం ఉంటుందని పేర్కొంది. 99.99 శాతం స్వచ్ఛతతో సిలికాన్ ను ఉత్పత్తి చేసినట్టు ప్రకటించింది. మనుషులను చంద్రుడిపైకి పంపించేందుకు నాసా చేపడుతున్న కార్యక్రమానికి ఉపయోగపడేలా.. తాము అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతను నాసాకు అందించనున్నట్టు బ్లూ ఆరిజిన్ సంస్థ పేర్కొన్నది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP
Published date : 24 Feb 2023 06:08PM