American researchers 2023: ప్లాస్టిక్ నుంచి బయోచార్
Sakshi Education
భూమికి అత్యంత ముప్పుగా పరిణమించిన ప్లాస్టిక్ నుంచి బొగ్గును తయారు చేశారు అమెరికా పరిశోధకులు.
Biochar from plastic
స్టిరోఫోమ్ ప్యాకేజీకి ఉపయోగించే, పాలిస్టిరీన్ వాటర్ బాటిళ్ల తయారీకి వాడే పాలి ఇథిలీన్ టెరాఫ్తలేట్(పీఈటీ) అనే రెండు రకాల ప్లాస్టిక్‌ల నుంచి ఈ బొగ్గును ఆవిష్కరించారు. వీటిని మొక్కజొన్న పంట ఉప ఉత్పత్తి అయిన కార్న్‌స్టవర్‌కు కలపడం ద్వారా.. బయోచార్(బొగ్గు అధిక కార్బన్ రూపం)ను రూపొందించారు. ఈ బయోచార్ నేలలో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచి సారవంతం చేస్తుంది.