World Economic Forum: కార్చిచ్చును అరికట్టేందుకు ఏఐ
Sakshi Education
ప్రతి ఏటా కార్చిచ్చుల కారణంగా సగటున 50 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతోంది. కార్చిచ్చు వంటి ప్రకృతి విపత్తులను సమర్ధంగా ఎదర్కోవడంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్ ్స(ఏఐ) ఉపయోగపడుతుందని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) జనవరి 16న తెలిపింది.
ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఏఐ సాయంతో కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెన్సర్లు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందజేయడమే కాకుండా.. పొగను త్వరగా గుర్తించి అప్రమత్తం చేస్తాయి. దాంతో మంటల్ని ఎక్కువ దూరం విస్తరించకుండా అడ్డుకోవచ్చు అని వివరించింది. ప్రస్తుతం అమెరికా ఇలాంటి రెండు ప్రోగ్రామ్స్‌ను అభివృద్ధి చేస్తోందని తెలిపింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కార్చిచ్చుల కారణంగా సగటున రూ.50 బిలియన్ డాలర్ల(రూ. 40లక్షల కోట్ల)నష్టం వాటిల్లుతుందని వెల్లడించింది. కార్చిచ్చును అరికట్టడంతోపాటు అడవులను కాపాడడం కోసం ఆర్టిఫీషియల్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్(ఎమ్‌ఎల్) వంటి అత్యాధుని పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ప్రపంచ దేశాలను కోరింది.
Also read: China's dam construction: చైనా ఆనకట్ట నిర్మాణంపై భారత్ ఆందోళన
Published date : 23 Jan 2023 04:18PM