China's dam construction: చైనా ఆనకట్ట నిర్మాణంపై భారత్ ఆందోళన
Sakshi Education
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో చైనా 60 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆనకట్ట నిర్మాణం చేపట్టడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది.
యార్లుంగ్ త్సాంగ్పో (బ్రహ్మపుత్ర) నదిపై నిర్మిస్తున్న ఈ డ్యామ్ ద్వారా చైనా నీళ్లను మళ్లించుకొనే అవకాశం ఉందని కేంద్ర విద్యుత్తు శాఖ వెల్లడించింది. చైనా ఈ డ్యామ్ ద్వారా నీళ్లను ఆపి.. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాంలలో వరద పరిస్థితులకు లేదా నీటి కొరతకు కారణమయ్యే ఆస్కారముందని తెలిపింది. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్ సన్నద్ధంగా ఉందని, నీటి నిల్వ కోసం అరుణాచల్‌ప్రదేశ్‌లో చాలా చోట్ల ఆనకట్టల నిర్మాణాన్ని చేపట్టిందని అధికారులు తెలిపారు.
Also read: Sikkim Govt: జనాభాను పెంచేందుకు ప్రభుత్వ ఉద్యోగినులకు వరాలు
Published date : 23 Jan 2023 03:48PM