Skip to main content

Aditya – L1 Orbit Increase: మూడోసారి ఆదిత్య –ఎల్‌1 కక్ష్య దూరం పెంపు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) నుంచి ప్రయోగించిన ఆదిత్య –ఎల్‌1 ఉపగ్రహానికి మూడోసారి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంపొందించింది.
Aditya – L1 Orbit Increase
Aditya – L1 Orbit Increase

బెంగళూరులోని మిషన్‌ ఆపరేటర్‌ కాంఫ్లెక్స్‌ (ఎంఓఎక్స్‌), ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌(ఇ్రస్టాక్‌), పోర్టుబ్లెయర్‌లోని స్పేస్ ఏజెన్సీ కేంద్రాల శాస్త్రవేత్తలు  కక్ష్య దూరాన్ని మరింత పెంచారు. కక్ష్య దూరం పెంపుదలతో ఉపగ్రహం  296 కిలోమీటర్లు * 71,767 కిలోమీటర్ల దూరానికి చేరుకుంది.

Aditya-L1 successfully boost first orbital: ఆదిత్య–ఎల్‌1 మొదటి కక్ష్య పెంపు విజయవంతం

ఉపగ్రహాన్ని ఇప్పటికే రెండుసార్లు విజయవంతంగా పెంచారు. లాంగ్రేజ్‌ పాయింట్ ఎల్‌1కు చేరేసరికి మరోసారి కక్ష‍్య పెంపు ఉంటుంది. 125 రోజుల ప్రయాణం తర్వాత ఉపగ్రహం నిర్దేషిత ఎల్‌1 పాయింట్‌కు చేరుకోనుంది. సూర్యునిలో కరోనా అధ్యయనానికి పంపిన ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం ఇప్పటికే భూమి, చంద్రునికి సంబందించిన ఫొటోలను పంపించింది. భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్‌1 పాయింట్‌కు చేరి సూర్యునిపై పరిశోధనలు చేయనుంది.  

Aditya L1 Mission Launch Live updates: ఆదిత్య–ఎల్‌1 ప్ర‌యోగం విజ‌య‌వంతం

Published date : 11 Sep 2023 05:55PM

Photo Stories