Skip to main content

ఏపీలో వైద్య విధానాలు భేష్‌

We will provide German medical technology to AP
  • జర్మనీ వైద్య సాంకేతికతను ఏపీకి అందిస్తాం 
  • విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో జర్మనీ కంపెనీల పెట్టుబడులను ప్రోత్సహిస్తాం 
  • జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌  

సాక్షి, అమరావతి: వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న ఏపీ ప్రభుత్వంతో కలి సి పనిచేసేందుకు సిద్ధంగా ఉ న్నట్లు జర్మనీ కాన్సుల్‌ జనరల్‌ మైకేలా కుచ్లర్‌ చెప్పారు. విజ్ఞా న సముపార్జనలో భాగంగా వైద్య విద్యార్థుల పరస్పర మార్పిడి, వైద్య పరిశోధనల్లో సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. గురువారం మంగళగిరిలోని వైద్యారోగ్యశాఖ ప్రధాన కార్యాలయంలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినితో ఆమె భేటీ అయ్యారు.

కుచ్లర్‌ మాట్లాడుతూ..కోవిడ్‌ సమయంలో భారత్‌ అందించిన సహాయానికి జర్మనీ రుణపడి ఉంటుందన్నారు. ఏపీలోనూ కోవిడ్‌ బాధితులకు వైద్యం అందించిన తీరును ప్రశంసించారు. యోగ, ఆయుర్వేదం వంటి ప్రాచీన వైద్య విధానాలను తమ దేశంలో అమలు చేసేలా.. అక్కడి వైద్య సాంకేతికతను ఏపీకి అందించేలా ఒప్పందాలకు ప్రతిపాదించారు. మంత్రి రజిని మాట్లాడుతూ..రూ.16వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తూ ఏపీని హెల్త్‌ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్‌ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని తెలిపారు. వైద్య పరికరాల తయారీలో మెడ్‌ టెక్‌ జోన్‌ టాప్‌లో నిలుస్తోందన్నారు.

చ‌ద‌వండి: వేగంగా బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ పనులు

ఏపీలోని నర్సింగ్‌ విద్యార్థులు వృత్తి నిర్వహణకు జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారని..వారికి కళాశాలల్లో జర్మన్‌ భాష నేరి్పంచేలా ఆలోచిస్తున్నామన్నారు. జర్మనీ వెళ్లే తమ విద్యార్థులకు నాలుగేళ్ల కాలపరిమితితో వీసాలు ఇవ్వాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా తమ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమలు చేస్తోందన్నారు.

జర్మనీ వైద్య రంగంలో మానవ వనరుల కొరతను భారత్‌ సాయంతో అధిగమిస్తామని మైకేలా చెప్పగానే..ఇప్పటికిప్పుడు 10వేల మంది నర్సింగ్‌ సిబ్బందిని జర్మనీకి పంపేందుకు ఏపీ సిద్ధంగా ఉందన్నారు. విశాఖలోని మెడ్‌టెక్‌ జోన్‌లో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించగా మైకేలా సానుకూలంగా స్పందించారు. వైద్యారోగ్య శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఏపీవీవీపీ కమిషనర్‌ వెంటేశ్వర్లు, డీఎంఈ నర్సింహం పాల్గొన్నారు. 

చ‌ద‌వండి: ఇవి ఇళ్ల పట్టాలు మాత్రమే కాదు.. సామాజిక న్యాయ పత్రాలు: సీఎం జగన్‌

Published date : 26 May 2023 03:27PM

Photo Stories