Venkaiah Naidu: కోవిడ్–19 ప్రొటోకాల్ గైడ్‌ను రూపొందించిన ఆస్పత్రి?
ఈ పుస్తకాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. పరీక్షలు, చికిత్సల్లో అనుసరించే మెళకువలు, వాడే మందులకు సంబందించిన ప్రొటోకాల్ వంటి సమగ్ర వివరాలను ఇందులో పొందుపరిచారు. కరోనా చికిత్సలు అందించే ఫిజీషియన్లకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఏఐజీ చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి చెప్పారు.
బెంగళూరులో 106 భాషల ప్రజలు
సిలికాన్ సిటీ బెంగళూరులో 22 అధికార, 84 ఇతరత్రా భాషలు కలిపి మొత్తం 106 భాషలు మాట్లాడేవారు నివసిస్తున్నారు. ఇందులో 44.5% మంది కన్నడ మాట్లాడేవారు కాగా, 15% తమిళం, 14% తెలుగు, 12% ఉర్దూ, 3% మలయాళీలు, 6% మంది ఇతర భాషలు మాట్లాడే ప్రజలున్నారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఢిల్లీకి చెందిన ఓ నిపుణుడు నిర్వహించిన పరిశోధనలో ఇది వెల్లడైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఆస్పత్రి రూపొందించిన ‘కోవిడ్–19 ప్రొటోకాల్ అండ్ గైడ్ లైన్స్’ పుస్తకం ఆవిష్కరణ
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కరోనా చికిత్సలు, మార్గదర్శకాల కోసం...