Telangana: మిషన్ భగీరథను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
తెలంగాణ రాష్ట్రంలో తాగునీరు, పారిశుధ్య సౌకర్యాల మెరుగునకు ప్రభ్యుత్వం అనేక ప్రత్యేక చర్యలు చేపట్టింది. అందులో మిషన్ భగీరథది కీలకపాత్ర. ఈ పథకాన్ని 2016, ఆగస్టు 6వ తేదీన గజ్వేల్ నియోజకవర్గం, కోమటిబండ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలోని నల్లాల ద్వారా అన్ని కుటుంబాలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించాలనేది మిషన్ భగీరథ లక్ష్యం. దీని ఫలితాలను ఫిబ్రవరి 23న తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2021లో ప్రభుత్వం పేర్కొంది. ఆ వివరాలు ఇలా..
మిషన్ భగీరథ..
- రాష్ట్రంలోని వందశాతం గ్రామీణ నివాస ప్రాంతాల (24,028 రూరల్ హాబిటేషన్లు)కు 2021 నాటికి పైపుల ద్వారా నీటి సరఫరా
- 2020–21కల్లా అన్ని రూరల్ హాబిటేషన్లలో నల్లాల ద్వారా రోజుకు వందలీటర్ల తలసరి నీరు సరఫరా
- దీనికింద అత్యధికంగా లబ్ధి పొందుతున్న జిల్లాల్లో నల్లగొండ (7.07%), భద్రాద్రి కొత్తగూడెం (6.39%), మహబూబాబాద్ (5.67%), ఆదిలాబాద్ (5.02%) ఉన్నాయి.
- గ్రామీణ జనాభాలోని 2.07 కోట్ల మందిలో వందశాతం ప్రజలు భగీరథ పథకం కింద లబ్ధిపొందారు.
64.9లక్షల ఎకరాలకు సాగునీరు
మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో పాత, కొత్త కలిపి 64.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోందని తాజా నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. నివేదిక ప్రకారం.. కొత్త ప్రాజెక్టుల ద్వారా అదనంగా 14.2 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. నిర్మాణం పూర్తి చేసుకున్న 9 నీటిపారుదల ప్రాజెక్టుల కింద 16.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సరఫరా జరుగుతోంది. నిర్మాణంలో ఉన్న 24 నీటిపారుదల ప్రాజెక్టుల కింద 16.9 లక్షల ఆయకట్టుకు నీరందనుంది.
Telangana: రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం వాటా ఎంత శాతం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్