Telangana Farmers: దేశంలో తెలంగాణ రైతుల స్థానం.. అప్పుల్లో 5, ఆదాయంలో 25
అంటే రోజుకు రూ.340 మాత్రమే. అదే సమయంలో ఒక్కో రైతుకు సగటున రూ.74,121 అప్పు ఉంది. ఇక రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో, ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. 2018 జూలై నుంచి 2019 జూన్ వరకు దేశంలోని వ్యవసాయ కుటుంబాలు, రైతుల అప్పు, ఆదాయంపై సర్వే జరిగింది. సర్వే వివరాలు ఇటీవల పార్లమెంటులో చర్చకు రాగా.. అందుకు సంబంధించి కేంద్ర వ్యవసాయ శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. రైతు కోసం ఎన్ని పథకాలు తీసుకొస్తున్నా రైతు పరిస్థితి పూర్తిస్థాయిలో బాగుపడటం లేదు. స్వామినాథన్ సిఫారసుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.
Jogulamba Temple: జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు
రోజుకు రూ.313 మాత్రమే
కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర రైతులు అప్పుల్లో దేశంలో ఐదో స్థానంలో నిలిచారు. తెలంగాణ రైతుల అప్పు సగటున రూ.1,52,113గా ఉంది. రైతు కుటుంబసభ్యుల సగటు ఆదాయం నెలకు రూ.9,403గా ఉంది. ఏడాదికి రూ.1,12,836. అంటే రోజుకు రూ.313 మాత్రమేనన్న మాట. ఇది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సగటు జీతం కంటే దాదాపు సగం తక్కువ. ఇక ఆదాయంలో తెలంగాణ రైతు దేశంలో 25వ స్థానంలో ఉన్నాడని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా మేఘాలయ రైతు సగటున నెలకు రూ. 29,348 ఆదాయం పొందుతున్నాడు. పంజాబ్ రైతు రూ. 26,701, హరియాణ రైతు రూ.22,841, అరుణాచల్‌ప్రదేశ్ రైతు రూ. 19,225 పొందుతున్నాడని కేంద్రం తెలిపింది.