Jogulamba Temple: జోగులాంబ ఆలయానికి అంతర్జాతీయ అవార్డు
Sakshi Education

అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠమైన ఆలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు దక్కింది. హిందూస్థాన్ గగన్ గౌరవ్ జ్యోతిర్లింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగుళూరులో శక్తిపీఠ సమాగం నిర్వహించారు. కాగా సంస్థ యొక్క కార్యవర్గం సాంస్కృతిక రంగంలో సమాజానికి విశేష సేవలందిస్తున్న శక్తిపీఠాలకు ప్రధానం చేశారు. శ్రీ జోగులాంబ ఆలయాన్ని ప్రతిష్టాత్మక హిందూస్థాన్ గగన్ గౌరవ్ ఇంటర్నేషనల్ అవార్డు–2022 దక్కడంపై తెలంగాణ రాష్ట్రంలోని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP

Published date : 23 Dec 2022 06:43PM