Skip to main content

Breaking News: బిగ్ బ్రేకింగ్‌... సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌..?

తెలంగాణలో ఎన్నికల వేడి ఊపందుకుంది. ఒకవైపు పార్టీలు రాజకీయ పావులు కదుపుతూనే విమర్శల డోసు పెంచగా.. మరోవైపు కేంద్రం ఎన్నికల సంఘం ఎన్నికల కసరత్తును వేగవంతం చేసింది.
Telangana Assembly elections
Telangana Assembly elections

ఈ క్రమంలో బుధవారం ఎన్నికల సంఘానికి చెందిన బృందం తెలంగాణకు రానున్నార‌ని స‌మాచారం. 

ఈ నేప‌థ్యంలో సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు ఏర్పాట్ల పర్యవేక్షణకు.. కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణకు రానుంది. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి నేతృత్వంలోని ఈ బృందం హైదరాబాద్‌లోనే నాలుగు రోజులపాటు ఉండనుంది.

జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ బృందం భేటీ అయ్యి.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశంపై చర్చించనుంది. ఎంసీఆర్‌హెచ్ఆర్డీలో ఈ సమావేశం జరగనుంది.

Published date : 21 Jun 2023 03:47PM

Photo Stories