Skip to main content

TS Highcourt : ఆరుగురు కొత్త జడ్జీలు

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు.
Six Telangana HC advocates will now serve as judges
Six Telangana HC advocates will now serve as judges

తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులను నియమించాలంటూ సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం జూలై 25న కేంద్రానికి సిఫార్సు చేసింది. న్యాయవాదులు ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేష్‌ భీమపాక, పుల్లా కార్తీక్‌ అలియాస్‌ పి.ఎలమందర్, కాజా శరత్, జగన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావులకు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలంటూ కొలీజియం సిఫార్సుల్లో పేర్కొంది. ఈ సిఫార్సులపై రాష్ట్రపతి ఆమోదముద్ర వేయాల్సి ఉంది. కాగా, సీజేఐగా ఎన్‌వీ రమణ బాధ్యతలు తీసుకున్న తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 24 నుంచి 42కు పెంచారు. ఏడాది కాలంలో 17 మంది న్యాయమూర్తుల నియామకం చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్ర హైకోర్టులో 27 మంది జడ్జీలు విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఆరుగురికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే జడ్జీల సంఖ్య 33కు పెరగనుంది.

Also read: AP హైకోర్టుకు ఏడుగురు జడ్జీలు

Published date : 26 Jul 2022 05:43PM

Photo Stories