Telangana: రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా?
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారుల వాటా క్రమంగా పెరుగుతోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2020–21 ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం రోడ్లలో జాతీయ రహదారుల వాటా 3.6 శాతంగా ఉంది. మొత్తం రోడ్ల నిడివి 1,07,871.2 కిలోమీటర్లు ఉండగా ఇందులో జాతీయ రహదారులు 3,910 కిలోమీటర్ల మేర ఉన్నాయి.
2021–22 ఏడాది లెక్కల ప్రకారం..
2021–22 ఆర్థిక ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మరో వెయ్యి కిలోమీటర్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. దీంతో జాతీయ రహదారుల మొత్తం నిడివి 4,983 కి.మీ. కు చేరింది. అంటే మొత్తం రోడ్లలో వీటి వాటా 4.6 శాతానికి చేరింది. ఇది జాతీయ సగటు కంటే ఎక్కువ. ప్రస్తుతం దేశంలో ప్రతి 100 చదరపు కిలోమీటర్లకు జాతీయ రహదారులు 4.06 కిలోమీటర్లు ఉండగా రాష్ట్రంలో 4.45 కిలోమీటర్లు ఉన్నాయి.
నల్గొండ టాప్.. పెద్దపల్లి లాస్ట్: రాష్ట్ర సర్కారు లెక్కల ప్రకారం జాతీయ రహదారుల్లో నల్గొండ జిల్లా వాటా ఎక్కువుంది. ఈ జిల్లాలో 273 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులున్నాయి. నాగర్‌కర్నూలు, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో జాతీయ రహదారులే లేకపోవటంతో అట్టడుగు స్థానంలో ఉంది.
చదవండి: మిషన్ భగీరథను ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్