Andhra Pradesh: ప్రభుత్వ సలహాదారుగా నియమితులుకానున్న పద్మశ్రీ అవార్డీ?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు సమావేశమయ్యారు. సెప్టెంబర్ 28న తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ప్రజారోగ్యం, ముఖ్యంగా క్యాన్సర్ నివారణ, చికిత్సలు, ఆధునిక విధానాలపై సుదీర్ఘ సమాలోచనలు జరిగాయి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఆస్పత్రులను ఏర్పాటు చేయడంతో పాటు అందులో ఒకటి అత్యాధునికంగా తీర్చిదిద్దాలని సీఎం జగన్ సంకల్పించారని డాక్టర్ నోరి తెలిపారు.
సలహాదారుగా...
క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వానికి సలహాదారుగా ఉండాలని డాక్టర్ నోరిని ఈ సందర్భంగా సీఎం జగన్ కోరారు. ఈ మేరకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
చదవండి: ధర్మపథం కార్యక్రమాన్ని ప్రారంభించిన దక్షిణాది రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా నియమితులుకానున్న పద్మశ్రీ అవార్డీ?
ఎప్పుడు : సెప్టెంబర్ 28
ఎవరు : ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు
ఎందుకు : క్యాన్సర్ చికిత్సకు సంబంధించి తగిన సహాయ సహకారాలు అందించేందుకు...