Skip to main content

Metaverse: స్పేస్‌టెక్‌ పాలసీని రూపొందించిన రాష్ట్రం?

Metaverse

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా ‘స్పేస్‌టెక్‌ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)’ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని 2022, ఏప్రిల్‌ 18న వర్చువల్‌ ప్రపంచమైన ‘మెటావర్స్‌’వేదికగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Tilapia Fish: తెలంగాణలో ఫిష్‌ కల్చర్‌ సిస్టమ్‌ను అభివృద్ధి చేయనున్న సంస్థ?

నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలతో..
‘స్పేస్‌ టెక్‌’కు సంబంధించి 2021, సెప్టెంబర్‌లో కొత్త పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ ముసాయిదాను రాష్ట్ర ఐటీ విభాగం విడుదల చేసింది. స్పేస్‌ టెక్నాలజీపై పట్టున్న నిపుణులు, శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు, జాతీయ సంస్థలు, స్పేస్‌టెక్‌ పరిశ్రమ యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి పాలసీకి తుదిరూపు దిద్దుతోంది. ఈ పాలసీ ద్వారా రాష్ట్రంలో అంతరిక్ష రంగ ఉత్పత్తులు, సేవలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు, నైపుణ్య శిక్షణ, పరిశోధన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాలను నిర్దేశించుకుంది.

Banking Sector: రాష్ట్రంలో తొలి డిజిటల్‌ జిల్లాగా అవతరించిన జిల్లా ఏది?

‘మెటావర్స్‌’వేదికగా..

  • ఎమర్జింగ్‌ టెక్నాలజీలో ఆధునికమైనదిగా భావిస్తున్న ‘మెటావర్స్‌’ద్వారా ‘స్పేస్‌టెక్‌ పాలసీ’ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది.
  • ప్రపంచాన్ని వర్చువల్‌ (మిథ్య)గా మన ముందుంచే టెక్నాలజీతో రూపొందినదే ‘మెటావర్స్‌’.
  • కృత్రిమ మేథ (ఏఐ), వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగుమెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), 3డీ ఇమేజింగ్, బ్లాక్‌చెయిన్‌ వంటి అత్యున్నత సాంకేతికతల కలయికతో మెటావర్స్‌ను రూపొందించారు.
  • ఇందులో ఎవరైనా తమ ‘అవతార్‌’తో వర్చువల్‌ ప్రపంచంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని.. నేరుగా హాజరైన అనుభూతిని పొందవచ్చు.
  • 2022, ఏప్రిల్‌ 18న ‘మెటావర్స్‌’వేదికగా జరిగే ‘స్పేస్‌ టెక్‌ పాలసీ’విడుదల కార్యక్రమంలో.. రాష్ట్ర ఐటీ శాఖ అధికారులు వర్చువల్‌గా తమ ‘అవతార్‌’లతో పాల్గొననున్నారు.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
స్పేస్‌టెక్‌ పాలసీ (అంతరిక్ష సాంకేతిక విధానం)ని రూపొందించిన రాష్ట్రం?
ఎప్పుడు : మార్చి 30
ఎవరు    : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఎందుకు : తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలో గుర్తింపు పొందిన అంతరిక్ష సాంకేతిక హబ్‌గా మార్చేదిశగా..

Published date : 31 Mar 2022 03:49PM

Photo Stories