Medicine from the Sky: దేశంలో తొలిసారిగా ఆకాశమార్గం ద్వారా వ్యాక్సిన్‌ను ఎక్కడ సరఫరా చేశారు?
మారుత్, టెక్ ఈగల్, బ్లూ డార్ట్ కంపెనీ కంపెనీలకు చెందిన మూడు డ్రోన్ల ద్వారా ఆకాశమార్గాన వ్యాక్సిన్ సరఫరా కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారి వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభించారు. వైద్యులకు సహకారం అందించటంలో భవిష్యత్తులో డ్రోన్ల వ్యవస్థ ఎంతో ఉపయుక్తం కానుందని మంత్రి సింధియా ఈ సందర్భంగా పేర్కొన్నారు.
మొదటి డ్రోన్...
బ్లూ డార్ట్ కంపెనీ రూపొందించిన స్కై ఎయిర్ డ్రోన్. ఇది కిలో బరువునే మోసుకెళ్లగలదు. ఇది 40 కిలో మీటర్ల దూరం వరకు ఆకాశమార్గాన ప్రయాణించగలదు. ఇది వికారాబాద్ పట్టణంలోని సీహెచ్‌సీ ఆస్పత్రికి చేరుకోగా, ఇందులో ఉన్న ఒక వ్యాక్సిన్‌ను సిబ్బంది రిసీవ్ చేసుకున్నారు.
రెండో డ్రోన్...
టెక్ ఈగల్స్ కంపెనీ రూపొందించిన క్యూరీస్ ఫ్లై. దీని సామర్థ్యం కూడా ఒక కిలో కాగా ఇది కూడా 40 కిలో మీటర్ల దూరం వరకు ఎగరగలదు. ఈ డ్రోన్ వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని రామయ్యగూడ పీహెచ్‌సీకి చేరుకుంది. దీన్ని కేవలం ట్రయల్ చేసి చూశారు.
చదవండి: ఏయే సంస్థల భాగస్వామ్యంతో బీ–హబ్‌ను నిర్మించనున్నారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలో తొలిసారిగా ఆకాశమార్గం ద్వారా వ్యాక్సిన్ సరఫరా ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి
ఎక్కడ : వికారాబాద్, వికారాబాద్ జిల్లా, తెలంగాణ
ఎందుకు : వైద్యరంగంలో సేవలు అందించేందుకు...