Skip to main content

Biopharma Hub: ఏయే సంస్థల భాగస్వామ్యంతో బీ–హబ్‌ను నిర్మించనున్నారు?

తెలంగాణ రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు బయోఫార్మా హబ్‌ (బీ–హబ్‌)ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖమంత్రి కె. తారక రామారావు ప్రకటించారు.
kTR
  • బీ–హబ్‌ భవనం నమూనా డిజైన్‌ను సెప్టెంబర్‌ 5న మంత్రి ఆవిష్కరించారు. ఫార్మారంగంలో అడుగుపెట్టే కొత్త కంపెనీల శీగ్రాభివృద్ధికి కేంద్రం (గ్రోత్‌–ఫేజ్‌ సెంటర్‌)గా బీ–హబ్‌ సేవలందించనుందని తెలిపారు.  దీంతో ఫార్మా ఉత్పత్తుల తయారీ సదుపాయం కూడా విస్తరిస్తుందన్నారు. మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • 15 నెలల్లో బీ–హబ్‌ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ఫార్మా రంగంలో తెలంగాణ ఆధిపత్యాన్ని నిలపడానికి ఇది దోహదపడనుంది.
  • రెండుదశల్లో లక్ష చదరపు అడుగుల నిర్మిత స్థలం (బిల్టప్‌ ఏరియా)లో జినోమ్‌ వ్యాలీలో దీన్ని నిర్మించనున్నారు.
  • కేంద్రప్రభుత్వ సంస్థ బయోటెక్‌ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా్ట సంస్థల భాగస్వామ్యంతో తెలంగాణ ప్రభుత్వం బీ– హబ్‌ను నిర్మించనుంది.
  • స్టార్టప్‌ల పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బీ–హబ్‌లో ప్రయోగశాలలు ఉంటాయి.
  • ఇతర సంస్థలతో చర్చలు, భాగస్వామ్యాలు చేసుకోవడానికి బీ–హబ్‌ వేదికగా ఉపయోగపడనుంది.

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : బయోటెక్‌ ఇండియాతో పాటు సైటియా, సెరెస్ట్రా్ట సంస్థల భాగస్వామ్యంతో బయోఫార్మా హబ్‌ (బీ–హబ్‌) ఏర్పాటు 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 5
ఎవరు    : తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ    : జినోమ్‌ వ్యాలీ, హైదరాబాద్‌
ఎందుకు    : తెలంగాణ రాష్ట్రంలో బయో ఫార్మా రంగాభివృద్ధికి ఊతమిచ్చేందుకు...
 

Published date : 07 Sep 2021 06:49PM

Photo Stories