BioAsia 2022: బయో ఆసియా 19వ వార్షిక సదస్సు థీమ్ ఏమిటి?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘‘బయో ఆసియా’’ 19వ వార్షిక సదస్సు(బయో ఆసియా–2022) ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. హైదరాబాద్ వేదికగా ఫిబ్రవరి 25వ తేదీ వరకు వర్చువల్ పద్ధతిలో జరిగే ఈ సదస్సును తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సదస్సులో 70కి పైగా దేశాల నుంచి సుమారు 30 వేలకు పైగా ప్రతినిధులతోపాటు పలువురు నోబెల్ గ్రహీతలు కూడా పాల్గొంటున్నారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సదస్సులో పాల్గొని మంత్రి కేటీఆర్‌తో చర్చలు జరిపారు.
ఫ్యూచర్ రెడీ..
‘ఫ్యూచర్ రెడీ’ నినాదంతో జరుగుతున్న బయో ఆసియా–2022 సదస్సు.. లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫార్మా, బయోటెక్ కంపెనీలు, బయోటెక్ స్టార్టప్‌లు, విధాన నిర్ణేతలు తదితరులు లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించిన అంశాలపై సదస్సులో విశ్లేషిస్తారు.
చదవండి: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు కానుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : 19వ బయో ఆసియా సదస్సు ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 24
ఎవరు : తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
ఎక్కడ : హైదరాబాద్ వేదికగా వర్చువల్ విధానంలో..
ఎందుకు : లైఫ్ సైన్సెస్ రంగం ప్రస్తుత స్థితిగతులతో పాటు భవిష్యత్ అవకాశాలపై చర్చించేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్