Epigraphy: దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ఎక్కడ ఏర్పాటు కానుంది?
దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్ కేంద్రంగా నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ తాజాగా నిర్ణయించింది. దీంతో శాసనాలను వెలుగులోకి తెచ్చి పదిలం చేసే వ్యవస్థ ఏర్పడేందుకు మార్గం సుగమం కానుంది. జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందుంచుతారు.
న్యూడెమోక్రసీలో చీలిక.. ప్రజాపంథా పార్టీ ఆవిర్భావం
సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీలో చీలిక ఏర్పడింది. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథాగా కొత్త పార్టీ ఆవిర్భవించింది. ఫిబ్రవరి 22న హైదరాబాద్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా డి.వి.కృష్ణ, సహాయ కార్యదర్శిగా పోటు రంగారావును ఎన్నుకున్నారు. కొత్త పార్టీలోకి మాజీ ఎమ్మె ల్యే గుమ్మడి నర్సయ్య కూడా వచ్చారు.
చదవండి: పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ఎక్కడ ప్రారంభించారు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోనే తొలి శాసనాల ప్రదర్శనశాల ‘‘నేషనల్ ఎపిగ్రఫీ మ్యూజియాన్ని’’ ఏర్పాటు చేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : కేంద్ర పర్యాటక, సాంస్కతిక శాఖ
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : జాతీయ స్థాయిలో లభించిన, కొత్తగా వెలుగు చూసే ముఖ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో భద్రపరిచి, వాటి ప్రాధాన్యాన్ని సరికొత్త సాంకేతికతతో సందర్శకుల ముందు ఉంచేందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్