Guntakal Railway Division: గుంతకల్లు రైల్వే డివిజన్‌కు అవార్డుల పంట
2022–23కు గాను స్టేషన్ల పరిశుభ్రత, టాక్ర్ మెయింటెనెన్స్, ఎల్‌సీ గేట్ల ఎత్తివేత, ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయపాలన, డీజిల్ షెడ్, వర్క్‌షాపు నిర్వహణ తదితర విభాగాల్లో అవార్డులు దక్కాయి.
Ground Water Conservation: భూగర్భ జలాల పరిరక్షణలో ప్రథమ స్థానంలో ఏపీ
గుంతకల్లు డివిజన్‌కు దక్కిన అవార్డులు ఇవే...
● క్లీన్ మెయింటెనెన్స్ సేష్టన్‌గా గుంతకల్లు రైల్వేస్టేషన్‌కు జీఎం షీల్డ్ దక్కింది.
● డీజిల్, ఎలక్ట్రికల్ లోకో షెడ్ల నిర్వహణకు సంయుక్త జీఎం అవార్డులను గుంతకల్లు డివిజన్‌లోని గుత్తి డీజిల్ లోకో షెడ్డు, విజయవాడలోని ఎలక్ట్రికల్ లోకో షెడ్ కై వశం చేసుకున్నాయి.
● బెస్ట్ ట్రాక్ మిషన్స్, ట్రాక్ మెయింటెనెన్స్‌కు గుంతకల్లు, సికింద్రాబాద్ డివిజన్లకు సంయుక్తంగా జీఎం అవార్డులు దక్కాయి.
● డివిజన్‌లోని రేణిగుంట జంక్షన్‌కు చెందిన ఏఆర్‌టీ వాహనానికి బెస్ట్ మెయింటెనెన్స్ వాహనంగా గుర్తింపు.
● ఉత్తమ వర్క్‌షాప్ అవార్డును తిరుపతిలోని మెకానికల్ వర్క్‌షాపు కై వసం చేసుకుంది.
● తిరుపతి–జమ్ముతావి–తిరుపతి (రైలు నం.22705/06) హమ్ సఫర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు బెస్ట్ మెయింటెడ్ లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అవార్డు దక్కింది.