AP Transco: కొత్త యాప్‌లను డెవలప్ చేసిన ఏపీ ట్రాన్స్‌కో
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ (ఏపీ ట్రాన్స్‌కో) అంతర్గతంగా రెండు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత యాప్‌లు అభివృద్ధి చేసినట్లు ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. స్టేట్ లోడ్ డిస్పాచ్ సెంటర్ (ఎస్‌ఎల్‌డీసీ) రూపొందించిన ఈ యాప్‌లు ఇంట్రా స్టేట్ ఓపెన్ యాక్సెస్, లైన్‌క్లియర్ అప్లికేషన్ పేరుతో పనిచేస్తాయని చెప్పారు.
వినియోగదారులకు అవసరాలకు తగ్గట్టు విద్యుత్‌ను సరఫరా చేయడం, నెట్‌వర్క్ నిర్వహణ కోసం సహాయపడతాయని తెలిపారు. ఏపీ ట్రాన్స్‌కో ఇప్పటికే అంతర్గతంగా అభివృద్ధి చేసిన ఎనర్జీ ఫోర్‌కాస్టింగ్ మోడల్ జాతీయస్థాయిలో గుర్తింపు సాధించి ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షించిందని గుర్తుచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించి ఇంట్రాడే డిమాండ్ ఫోర్‌కాస్ట్ మోడల్ను అభివృద్ధి చేయడానికి ట్రాన్స్‌కో కృషిచేస్తోందని తెలిపారు. ఇది రానున్న ఒకటిన్నర గంటలో రాష్ట్ర డిమాండ్‌ను అంచనా వేస్తుందని ఆయన చెప్పారు.
చదవండి: ఫ్రాన్స్‌లోకి అడుగు పెట్టిన 'యూపీఐ’..
చదవండి: తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు?
చదవండి: అరకు కాఫీకి అంతర్జాతీయ ఖ్యాతి
Published date : 17 Jul 2023 03:30PM