Telangana High court: తెలంగాణ హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులు?
Sakshi Education
తెలంగాణహైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
Telangana High court
కొలీజియం సిఫారసు చేసిన జాబితాలో న్యాయాధికారి సుజన కళాసికం, న్యాయవాదులు లక్ష్మీనారాయణ అలిశెట్టి, అనిల్‌కుమార్ జూకంటి పేర్లు ఉన్నాయి.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజయ్ కౌశల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం ఆమోదించి రాష్ట్రపతికి నివేదించాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తే ఈ ముగ్గురూ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులవుతారు. వీరి పేర్లకు రాష్ట్ర గవర్నర్, సీఎం గతంలోనే ఆమోదం తెలిపారు.