AP High Court On Bigg Boss Show: బిగ్ బాస్ షో.. టీవీ ప్రసారాలకు సెన్సార్ లేకపోతే ఎలా?: ఏపీ హైకోర్టు
ప్రసారమయ్యాక అందే ఫిర్యాదులపై చర్యలు తీసుకొని ఏం ప్రయోజనం? అది పోస్టుమార్టం చేయడమే అవుతుంది. ఒకవేళ ప్రతీ ఛానల్ అశ్లీలతతో కూడిన కార్యక్రమాలను ప్రసారం చేస్తే దాన్ని పర్యవేక్షించకూడదా? ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరుపుతామని, కేంద్రానికి తగిన సచనలు చేసే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. టీవీ కార్యక్రమాల పర్యవేక్షణకు ఓ యంత్రాంగం లేకపోవడం సరికాదని వ్యాఖ్యానించింది.
AP High Court CJ: ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ధీరజ్ సింగ్
యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్ షో నిలిపివేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుత సామాజిక కార్యకర్త, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయి ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, స్టార్ వ టీవీ ప్రైవేట్ లిమిటెడ్, ఎండేమోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, బిగ్‌బాస్ షో వ్యాఖ్యాత అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.
Telangana High Court CJ: తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ అలోక్