Skip to main content

Krishna River Water: కృష్ణా జలాలను ఏ నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ పంచుకోనున్నాయి?

కృష్ణా నది జలాలను 2021 ఏడాది కూడా పాత పద్ధతి ప్రకారమే పంచుకోవాలని ఇరు తెలుగు రాష్ట్రాలు నిర్ణయానికి వచ్చాయి.
SrisailamDam
శ్రీశైలం ప్రాజెక్టు

ఈసారి ప్రాజెక్టుల్లో చేరే నీటిని 34ః66 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీ పంచుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశంలో ఒప్పందానికి వచ్చాయి. అయితే శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి విషయంలో మాత్రం ఏకాభిప్రాయం రాలేదు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ స్పష్టం చేయగా.. సాగు, తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఏపీ వాదించింది. కృష్ణా నది జలాల్లో వాటాలు, వినియోగం, విద్యుదుత్పత్తి సహా పలు కీలక అంశాలపై హైదరాబాద్‌లోని జలసౌధలో సెప్టెంబర్‌ 1న కృష్ణా బోర్డు చైర్మన్‌ ఎంపీ సింగ్‌ అధ్యక్షతన సమావేశాలు జరిగాయి.

కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశం ఏది?
సహ్యాద్రి కొండల్లోని ‘మహాబలేశ్వర్‌’(మహారాష్ట్ర) వద్ద కృష్ణానది ఆవిర్భవించింది. ఇది కర్ణాటక ద్వారా ప్రవహిస్తూ మహబూబ్‌నగర్‌ జిల్లాలో మక్తల్‌ వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఘటప్రభ, మల్లప్రభ, భీమా, తుంగభద్ర, దిండి, మూసీ నదులు కృష్ణా నదికి ముఖ్య ఉపనదులు. తుంగభద్ర కర్ణాటకలోని వరాహ పర్వతాల్లో ఆవిర్భవించి.. కర్నూలులోని సంగమేశ్వర్‌ వద్ద కృష్ణలో కలుస్తోంది. కృష్ణా నది... ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాలోని అవనిగడ్డకు దిగువన పాయలుగా చీలి హంసలదీవి వద్ద బంగాళాఖాతాన్ని చేరుతుంది. కృష్ణానది మొత్తం పొడవు 1400 కి.మీ.. 
క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కృష్ణా నది జలాలను 34ః66 నిష్పత్తిలో పంచుకోనున్న రాష్ట్రాలు? 
ఎప్పుడు   : సెప్టెంబర్‌ 1
ఎవరు    : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ 
ఎందుకు  : ఇరు రాష్ట్రాల నిర్ణయం మేరకు...
 

Published date : 02 Sep 2021 05:11PM

Photo Stories