Central Water Commission: దేశంలో ఏ నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం ఎక్కువ?
దేశంలో అతి పెద్ద నది గంగాపై నిర్మించిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం కంటే కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 70.07 టీఎంసీలు అధికమని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చింది. గంగా నదిపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తయితే అప్పుడు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులకంటే 53.29 టీఎంసీలు అధికంగా నిల్వ సామర్థ్యం ఉంటుందని పేర్కొంది. దేశంలో నదీ పరివాహక ప్రాంతాలలో(బేసిన్‌లో) ఇప్పటికే పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యంపై సీడబ్ల్యూసీ ఇటీవల అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో ప్రధానాంశాలు ఇలా..
GK Important Dates Quiz: ప్రపంచ NGO దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?
- దేశంలోని అన్ని బేసిన్‌లలో పూర్తయిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 9,104.55 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1,651.42 టీఎంసీలు. మొత్తం ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 10,755.97 టీఎంసీలు.
- హిమాలయ నదులకంటే ద్వీపకల్ప భారత్‌లో ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యమే 25% అధికం.
- దేశంలో అతి పెద్ద నది అయిన గంగాపై పూర్తయిన ప్రాజెక్టుల పూర్తి నిల్వ సామర్థ్యం 1,718.66 టీఎంసీలు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 270.13 టీఎంసీలు. మొత్తం నిల్వ సామర్థ్యం 1,988.79 టీఎంసీలు.
- దేశంలో రెండో అతిపెద్ద నది.. ద్వీపకల్పంలో అతి పెద్ద నది అయిన గోదావరిపై పూర్తయిన ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 1,237.43 టీఎంసీలే.
- దేశంలో మూడో పెద్ద నది.. కృష్ణా బేసిన్‌లో పూర్తయిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యం 1,788.73 టీఎంసీలు. దేశంలో అత్యధిక నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు ఉన్నది కృష్ణా బేసినే. ప్రస్తుతం 146.77 టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్నాయి.
- హిమాలయ నది బ్రహ్మపుత్రపై నిర్మించిన ప్రాజెక్టుల నిల్వ సామర్థ్యంకంటే దుర్భిక్ష ప్రాంతంలోని పెన్నా నదిపై పూర్తయిన ప్రాజెక్టుల నీటి నిల్వ అధికంగా ఉంది.
దేశంలోని ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో జలాశయాల నీటి నిల్వ సామర్థ్యం ఇదీ.. (టీఎంసీలలో)
|
|||
నది పేరు |
పూర్తయిన ప్రాజెక్టుల సామర్థ్యం |
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం |
మొత్తం |
గంగా |
1,718.66 |
270.13 |
1,988.79 |
కృష్ణా |
1,788.73 |
146.77 |
1,935.50 |
గోదావరి |
1,237.43 |
297.07 |
1,534.50 |
నర్మద |
770.43 |
93.27 |
863.70 |
ఇండస్ |
572.91 |
3.54 |
576.45 |
మహానది |
461.41 |
51.60 |
513.01 |
తాపి |
322.68 |
55.03 |
377.71 |
కావేరి |
320.77 |
0.53 |
321.30 |
మహి |
177.18 |
5.30 |
182.48 |
పెన్నా |
103.76 |
86.91 |
190.67 |
బ్రహ్మపుత్ర |
60.68 |
28.08 |
88.76 |
Char Dham Yatra: చార్‌ధామ్ యాత్రలో భాగమైన ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్