Skip to main content

Char Dham Yatra: చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన ఆలయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

Char Dham Yatra

ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్ర మే 03న ఆరంభమైంది. అక్షయ తృతీయ సందర్భంగా గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. గంగా, యమున విగ్రహాలను శీతాకాల విడుదుల నుంచి స్వస్థలాలకు తీసుకువచ్చారు. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సతీసమేతంగా గంగోత్రిని సందర్శించారు. యాత్రలో భాగమైన కేదార్‌నాథ్‌ మే 6న, బద్రీనాధ్‌ మే 8న తెరుచుకుంటాయి. 2019 తర్వాత కరోనా నియంత్రణలు లేకుండా జరుగుతున్న ఈ యాత్రకు లక్షలాది భక్తులు వస్తారని అంచనా. అయితే దేవాలయాలను సందర్శించే భక్తులపై రోజువారీ పరిమితి విధించారు.

GK Economy Quiz: రాబోయే ఎలక్ట్రిక్ వాహనాల కోసం "విడా" అనే కొత్త బ్రాండ్ పేరును విడుదల చేసిన కంపెనీ?

నాలుగు ఆలయాల సందర్శన..
చార్‌ధామ్‌ యాత్రలో భాగంగా భక్తులు యమునోత్రి ఆలయంతో ప్రారంభించి వరుసగా గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శిస్తారు. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా లక్షల మంది భక్తులు యాత్రలో పాల్గొంటారు. భారీ హిమపాతం కారణంగా ఈ నాలుగు ఆలయాలను అక్టోబర్‌–నవంబర్‌ మాసాల్లో మూసివేసి మళ్లీ ఏప్రిల్‌– మే నెలల్లో తిరిగి తెరుస్తారు. ఈ నాలుగు ఆలయాలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోనే ఉన్నాయి.India Ranks: వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌–2022లో భారత్‌ స్థానం?​​​​​​​

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రసిద్ధ చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం
ఎప్పుడు : మే 03
ఎవరు    : ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం
ఎక్కడ    : ఉత్తరాఖండ్‌
ఎందుకు : చార్‌ధామ్‌ యాత్రలో భాగమైన యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రినాథ్‌ ఆలయాలను దర్శించేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 04 May 2022 01:06PM

Photo Stories