Vijayawada: ప్రస్తుతం మిజోరాం రాష్ట్ర గవర్నర్‌గా ఎవరు ఉన్నారు?
వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు చెప్పారు. కోవిడ్ వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ఈ రంగాల్లో మంచి వృద్ధిరేటు నమోదవుతోందన్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఏపీ సాధిస్తోన్న పురోగతి అభినందనీయమన్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో మూడు రోజులపాటు నిర్వహించనున్న 4వ ఆర్గానిక్ మేళాను జనవరి 7న ఆయన ప్రారంభించారు.
ప్రకాశం జిల్లాలో మెగా లెదర్ పార్క్..
ప్రకాశం జిల్లాలో 500 ఎకరాల్లో ‘అంతర్జాతీయ మెగా లెదర్ పార్క్’ను ఏర్పాటు చేయనున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చర్మ పరిశ్రమ అభివృద్ధి సంస్థ (లిడ్‌క్యాప్) చైర్మన్ కాకుమాను రాజశేఖర్ ప్రకటించారు. దీనివల్ల 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించేలా ప్రతిపాదన చేశామని జనవరి 7న తెలిపారు.
ఒమిక్రాన్ ప్రాణాంతకమే: డబ్ల్యూహెచ్‌ఓ
ఒమిక్రాన్ వేరియంట్ ప్రాణాంతక మేనని, వ్యాధి తీవ్రత తక్కువున్న దానిగా పరిగణించలేమని ప్రపంచ ఆరోగ్య సంస ్థ(డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రభావం చూపిస్తోందని, అంతమాత్రాన దాని వల్ల స్వల్ప లక్షణాలే ఉంటాయని చెప్పలేమని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రయెసస్ చెప్పారు.
చదవండి: GK Sports Quiz: సీనియర్ మహిళల జాతీయ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న రాష్ట్రం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్