Skip to main content

NITI Aayog Report: పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ స్థానం?

Poverty

పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 13.74 శాతం ప్రజలు విభిన్న కోణాల్లో (మల్టీడైమెన్షనల్లీ పూర్‌) పేదరికం అనుభవిస్తున్నట్లు 2015–16లో నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌–4)లో తేలింది. ఈ సర్వే వివరాలను నీతి ఆయోగ్‌ నవంబర్ 26న వెల్లడించింది. దేశవ్యాప్తంగా విభిన్న కోణాల్లో దారిద్య్రానికి దిగువన ఉన్న జిల్లాల జాబితాను కూడా విడుదల చేసింది. సర్వే వివరాల ప్రకారం.. దేశంలో నిరుపేదలు అతితక్కువగా 0.71 శాతమే ఉన్న రాష్ట్రంగా కేరళ మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తరువాత 11వ స్థానంలో తెలంగాణ ఉంది. నిరుపేదలు అధికంగా ఉన్న రాష్ట్రంగా (51.91 శాతం) బిహార్ నిలిచింది. సమతుల ఆహారం అందించే విషయంలో తెలంగాణ 13వ స్థానంలో నిలవగా, చిన్నారులు, కౌమార దశలో ఉన్నవారి ఆరోగ్యం విషయంలో ఏడోస్థానంలో ఉంది.

చ‌ద‌వండి: కాగ్‌ లెక్కల ప్రకారం.. 2019–20లో రాష్ట్ర వృద్ధి రేటు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణకు 11వ స్థానం
ఎప్పుడు : నవంబర్ 26
ఎవరు    : నీతి ఆయోగ్‌
ఎక్కడ    : దేశంలో..

డౌన్‌లోడ్‌చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌చేసుకోండి.

యాప్‌డౌన్‌లోడ్‌ఇలా...
డౌన్‌లోడ్‌వయా గూగుల్‌ప్లేస్టోర్‌

Published date : 27 Nov 2021 05:33PM

Photo Stories