కరెంట్ అఫైర్స్ ఏప్రిల్ (7 – 15) బిట్ బ్యాంక్
1. డేవిస్ కప్ డబుల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన ప్లేయర్ గా ఇటీవల రికార్డుసృష్టించినఆటగాడు ఎవరు ?
1) లియాండర్ పేస్
2) మహేశ్ భూపతి
3) రోహన్ బోపన్న
4) యూకీ బాంబ్రీ
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్ డేవిస్ కప్ డబుల్స్ లో అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. చైనాలో జరిగిన ఆసియా ఓషియానా గ్రూప్ - 1 పోరులో భాగంగా రోహన్ బోపన్నతో కలిసి చైనా జోడీని ఓడించాడు. తద్వారా 43వ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పటి వరకు 42 విజయాలతో ఈ రికార్డు ఇటలీ దిగ్గజం నికొలా పీట్రాంగెలీ పేరిట ఉండేది.
-
2. సూర్యుడి రహస్యాలను చేధించేందుకు ఈ కింది వాటిలోని ఏ సంస్థ పార్కర్ సోలార్ ప్రోబ్ ను చేపట్టనుంది ?
1) ఇస్రో
2) నాసా
3) జాక్సా
4) రాస్ కాస్మోస్
- View Answer
- సమాధానం: 2
వివరణ: సూర్యుడి రహస్యాలను తెలుసుకునేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా... పార్కర్ సోలార్ ప్రోబ్ పేరుతో ఒక వ్యోమనౌకను ప్రయోగించనుంది. 2018 జూలై 31న ఈ ప్రయోగాన్ని జరపనుంది. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి డెల్టా ఫోర్ రాకెట్ ద్వారా దీనిని పంపనున్నారు. గతంలో సూర్యుడికి దగ్గరగా ఏ వ్యోమనౌక వెళ్లనంత దగ్గరగా ఇది వెళుతుంది. 24 సార్లు సూర్యుడి చుట్టు తిరిగి.. దశాబ్దాలుగా అంతుచిక్కని కరోనా రహస్యాలను శోధించనుంది.
-
3. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్- IBLA లో బిజినెస్ లీడర్ విభాగంలో స్టేట్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం పొందిన రాష్ట్రం ఏది ?
1) ఛత్తీస్‌గఢ్
2) తెలంగాణ
3) ఆంధ్రప్రదేశ్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 1
4. యూఏఈ ఇటీవల ఏ దేశంతో కలిసి ‘‘డెసర్ట్ టైగర్ 5’’ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించింది ?
1) వియత్నాం
2) భారత్
3) ఇండోనేషియా
4) మలేషియా
- View Answer
- సమాధానం: 4
వివరణ: డెసర్ట్ టైగర్ 5 పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలను ఇటీవల యూఏఈ, మలేషియాకలిసి దుబాయ్ లో నిర్వహించాయి. రెండు దేశాల సైన్యం మధ్య సత్సంబంధాలు, యుద్ధ సహకారాన్ని పెంపొందించేందుకు ఈ విన్యాసాలు నిర్వహించారు.
-
5. రైతుల కోసం ఉజ్హావన్ పేరుతో మొబైల్ యాప్ ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది ?
1) తెలంగాణ
2) తమిళనాడు
3) మధ్యప్రదేశ్
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
వివరణ: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఉజ్హావన్ (Uzhavan ) పేరుతో ప్రత్యేక యాప్ ని ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా పంట బీమా, రాయితీ, సాగులో సాంకేతికత వినియోగం తదితర 9 సేవలు పొందవచ్చు.
-
6. బోఆవో ఫోరమ్ ఆసియా నూతన చైర్మన్ గా ఇటీవల ఎవరుఎన్నికయ్యారు?
1) యాసువో ఫుకూదా
2) లి బావోడాంగ్
3) బాన్ కీ మూన్
4) జో జియచౌన్
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్.. ఇటీవల బోఆవో ఫోరమ్ ఆఫ్ ఆసియా నూతన చైర్మన్ గా ఎన్నికయ్యారు. జపాన్ ప్రధాన మంత్రి యాసువో ఫుకుదా నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక అంశాల్లో ఆసియా దేశాలను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు బోఆవో ఫోరమ్ కృషి చేస్తుంది.
-
7. యువతలో విటమిన్ డి లోటుని నివారించేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ఇటీవల ప్రారంభించిన ప్రాజెక్టు ఏది ?
1) ప్రాజెక్ట్ సన్
2) ప్రాజెక్ట్ గరమ్
3) ప్రాజెక్ట్ ధూప్
4) ప్రాజెక్ట్ రష్మీ
- View Answer
- సమాధానం: 3
వివరణ: ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI) ఇటీవల యువతలో విటమిన్ డిలోపాన్ని నివారించేందుకు ప్రాజెక్ట్ ధూప్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పాఠశాలల్లో విద్యార్థుల ప్రార్థన సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య నిర్వహించాలని సూచించింది. దీని వల్ల శరీరం విటమిన్ డి ని ఎక్కువగా శోషించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించింది.
-
8. "Water, Environment and Climate Change: Knowledge Sharing and Partnership'' తొలి సమావేశం ఇటీవల ఏ దేశంలో జరిగింది ?
1) శ్రీలంక
2) భారత్
3) బంగ్లాదేశ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 4
వివరణ: "Water, Environment and Climate Change: Knowledge Sharing and Partnership'' తొలి అంతర్జాతీయ సమావేశం ఇటీవల నేపాల్ లోని ఖాట్మాండులో జరిగింది. మూడు రోజుల పాటు జరిగిన సమావేశాన్ని నేపాల్ ప్రభుత్వం నిర్వహించింది. నీరు, పర్యావరణ విషయాల్లో నూతన సవాళ్లపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు, ప్రభుత్వ అధికారులను ఒక్క చోట చేర్చేందుకు ఈ సమావేశం నిర్వహించారు. 20 దేశాలకు చెందిన 100 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
-
9. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత షూటర్ హీనా సిద్ధు ఏ విభాగంలో స్వర్ణం గెలుచుకుంది ?
1) 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్
2) 40 మీటర్ల పిస్టల్ ఈవెంట్
3) 65 మీటర్ల పిస్టల్ ఈవెంట్
4) 100 మీటర్ల పిస్టర్ ఈవెంట్
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత షూటర్ హీనా సిద్ధు మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది.
-
10. సెంట్రల్ ఇండస్టియ్రల్ సెక్యూరిటీ ఫోర్స్ నూతన డెరైక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఓపీ సింగ్
2) కరంబిర్ సింగ్
3) రాజేశ్ రంజన్
4) ఓం ప్రకాశ్ మిథర్వాల్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 1984 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన రాజేశ్ రంజన్.. ఇటీవల సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ నూతన డెరైక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. 2020 నవంబర్ 30 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.
-
11. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నూతన సభ్యులుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) ఎం. సత్యవతి
2) మనోజ్ బస్సి
3) సుజాతా భోన్సలే
4) భీమ్ సెయిన్ జోషి
- View Answer
- సమాధానం: 1
వివరణ: 1982 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన ఎం. సత్యవతి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నూతన సభ్యురాలుగా నియమితులయ్యారు. ఆమె ఇంతకముందు డీజీసీఏ తొలి మహిళా డెరైక్టర్ జనరల్ గా పనిచేశారు.
-
12. 2018-19లో భారత వృద్ధి రేటు ఎంతగా నమోదవుతుందని ఆసియా డెవలప్మెంట్ ఔట్ లుక్ వెల్లడించింది ?
1) 7.3 శాతం
2) 7.6 శాతం
3) 7.9 శాతం
4) 8.3 శాతం
- View Answer
- సమాధానం: 1
వివరణ: మనీలా కేంద్రంగా పనిచేస్తున్న ఆసియా అభివృద్ధి బ్యాంక్.. ఇటీవల ఆసియా దేశాల ఆర్థిక పురోగతిపై ఆసియా డెవలప్మెంట్ ఔట్ లుక్ పేరుతో నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం 2018-19లో భారత వృద్ధి రేటు 7.3 శాతంగా నమోదు కానుంది.
-
13. ప్రపంచంలో అతిపెద్ద సోలార్ పార్క్ భారత్ లోని ఏ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది ?
1) గుజరాత్
2) మహారాష్ట్ర
3) పంజాబ్
4) రాజస్థాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: గుజరాత్ లోని ధోలేరా స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ లో 5 వేల మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపాణి ఇటీవల ఆమోదం తెలిపారు. ఇది పూర్తయితే.. ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ గా నిలవనుంది. 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో 11 వేల హెక్టార్లలో ఈ పార్కుని ఏర్పాటు చేయనున్నారు.
-
14. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన కార్యదర్శిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు ?
1) విభా భార్గవ
2) జగదీశ్ ముఖి
3) అనుపమ భట్నాగర్
4) కేఎస్ సరస్వత్
- View Answer
- సమాధానం: 3
వివరణ: సీనియర్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అధికారి అనుపమ భట్నాగర్.. ఇటీవల ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నూతన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ఆమెకన్నా ముందు విభా భార్గవ ఈ పదవిలో ఉన్నారు.
-
15. 2018-19 సంవత్సరానికి గాను నాస్కామ్ చైర్మన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) రిషద్ ప్రేమ్ జీ
2) కేశవ్ మురుగేశ్
3) రామన్ రాయ్
4) కేఎల్ పాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: విప్రో సంస్థ చీఫ్ స్ట్రేటజీ ఆఫీసర్ రిషద్ ప్రేమ్ జీ.. ఇటీవల 2018-19 సంవత్సరానికి గాను National Association of Software and Services Companies (NASSCOM) చైర్మన్ గా నియమితులయ్యారు. ఇంతకుముందు రామన్ రాయ్ ఆ పదవిలో ఉన్నారు. రిషద్.. విప్రో చైర్మన్ అజీమ్ ప్రేమ్ జీ కుమారుడు.
-
16. ఖనిజాల అన్వేషణను ప్రచారం చేసేందుకు భారత్ ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
1) జర్మనీ
2) మొరాకో
3) బ్రెజిల్
4) ఫ్రాన్స్
- View Answer
- సమాధానం: 2
వివరణ: నాణ్యమైన ఖనిజాల గుర్తింపు, వాటి అన్వేషణను ప్రచారం చేసేందుకు భారత ప్రభుత్వం మొరాకోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా రెండు దేశాలు కలిసి ఖనిజాన్వేషణకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తాయి.
-
17. ఆర్థిక స్వేచ్ఛా సూచీ - 2018 లో భారత్ ఎన్నో ర్యాంకులో నిలిచింది ?
1) 120
2) 125
3) 130
4) 119
- View Answer
- సమాధానం: 3
వివరణ: అమెరికాకు చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ ఆర్థిక స్వేచ్ఛా సూచీ - 2018 ను విడుదల చేసింది. ఇందులో భారత్ 54.5 పాయింట్లతో 130వ స్థానంలో నిలిచింది. ఆస్తి హక్కులు, ఆర్థిక హక్కులు వంటి 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని 186 దేశాలతో ఈ నివేదికను రూపొందించారు. ఇందులో హాంగ్‌కాంగ్ తొలి స్థానంలో నిలవగా సింగపూర్, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-
18. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - ICMR నూతన డెరైక్టర్ జనరల్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) క్రిష్ణ ఎస్ పాల్
2) బలరాం భార్గవ
3) సౌమ్య స్వామినాథన్
4) విక్రమ్ కోచెట
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఎయిమ్స్‌లో సీనియర్ కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్న బలరాం భార్గవ.. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ - ICMR నూతన డెరైక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. సౌమ్యా స్వామినాథన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు చేపడతారు. సౌమ్యా స్వామినాథన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డెప్యుటీ జనరల్ ఆఫ్ ప్రోగ్రామ్స్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
-
19. ""India's Heritage of Gharana Music: Pandits of Gwalior'' పుస్తక రచయిత ఎవరు ?
1) కరణ్ సింగ్
2) మీటా పండిట్
3) మ్రినాల్ సక్సేనా
4) విక్రమ్ పండిట్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ‘"India's Heritage of Gharana Music: Pandits of Gwalior'' పుస్తకాన్ని మీటా పండిట్ రచించారు. ఇటీవల ఈ పుస్తకాన్ని కాంగ్రెస్ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, కరణ్ సింగ్ ఆవిష్కరించారు.
-
20. 21వ కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ ఏ దేశాన్ని ఓడించి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో స్వర్ణం గెలుచుకుంది ?
1) జర్మనీ
2) జపాన్
3) మలేషియా
4) చైనా
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ మలేషియాను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. కిదాంబి శ్రీకాంత్ - సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప - సాత్విక్ సాయిరాజ్ భారత్ కు ఈ స్వర్ణం అందించారు.
-
21. బహ్రెయిన్ గ్రాండ్ ప్రి - 2018 విజేత ఎవరు ?
1) సెబాస్టియన్ వెటెల్
2) లూయిస్ హామిల్టన్
3) బొటాస్
4) ఒకాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బహ్రెయిన్ గ్రాండ్ ప్రి లో ఫెరారీ జట్టుకి చెందిన జర్మనీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. మెర్సిడీస్ డ్రైవర్ బొటాస్ రెండో స్థానంలో, అదే జట్టుకు చెందిన మరో డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మూడో స్థానంలో నిలిచారు.
-
22. కింగ్ ఫిషర్ జాతికి చెందిన నాలుగు పక్షులను ఇటీవల ఏ అటవీ జంతువుల సంరక్షణ కేంద్రంలో గుర్తించారు ?
1) బంధీపూర్ జాతీయ పార్క్
2) జిమ్ కార్బెట్ జాతీయ పార్క్
3) కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీ
4) కవ్వాల్ టైగర్ రిజర్వ్
- View Answer
- సమాధానం: 3
వివరణ: కింగ్ ఫిషర్ జాతికి చెందిన నాలుగు పక్షులను ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చ్యురీలో గుర్తించారు. అవి.... పైడ్ కింగ్ ఫిషర్, వైట్ థ్రోటెడ్ కింగ్ ఫిషర్, బ్లాక్ కాప్డ్ కింగ్ ఫిషర్, కామన్ కింగ్ ఫిషర్. భారత్ లో మొత్తం 12 రకాల కింగ్ ఫిషర్ జాతి పక్షులు కనిపిస్తాయి. కృష్ణాలో కనిపించిన పక్షులు తడి నేలలను ఆవాసంగా చేసుకుంటాయి.
-
23. భారత్ ఇటీవల ఏ దేశంతో వ్యూహాత్మక రైల్వే లింక్ నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకుంది ?
1) శ్రీలంక
2) నేపాల్
3) బంగ్లాదేశ్
4) పాకిస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: వ్యూహాత్మక రైల్వే లింక్ నిర్మాణం కోసం భారత్ ఇటీవల నేపాల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా బిహార్ లోని రాక్సౌల్, నేపాల్ రాజధాని కట్మాండు మధ్య రైల్వే లైన్ నిర్మాణం జరుపుతారు. ప్రజల సౌకర్యార్థం, సరుకుల రవాణా కోసం ఈ నిర్మాణం చేపట్టాలని రెండు దేశాలు నిర్ణయించాయి. అలాగే జల రవాణా అంశంలోను ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
-
24. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం ప్రధాన లక్ష్యం ఏంటి ?
1) మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం
2) గ్రామాల్లో ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం
3) గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం
4) పట్టణ మహిళల సాధికారతకు కృషి చేయడం
- View Answer
- సమాధానం: 1
వివరణ: మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకు 2016లో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ప్రారంభించారు. సంప్రదాయంగా కట్టెల పొయి్యలపై వంటలు చేస్తూ అనారోగ్యానికి గురవుతున్న మహిళలను స్వచ్ఛ ఇంధన వినియోగం వైపు మళ్లించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించారు. పథకంలో భాగంగా ఇటీవల న్యూఢిల్లీలో లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ కనెక్షన్లను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ పంపిణీ చేశారు.
-
25. భారత నావికులకు ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ దేశంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ?
1) దక్షిణ కొరియా
2) జపాన్
3) శ్రీలంక
4) ఇండోనేషియా
- View Answer
- సమాధానం: 1
వివరణ: కేంద్ర రవాణా, రహదారులు, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆ దేశ ప్రభుత్వంతో నావికుల గుర్తింపు కోసం సంయుక్త అర్హత గుర్తింపు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని వల్ల దక్షిణ కొరియా నౌకల్లో భారత్‌కు చెందిన సుమారు 500 మంది నావికులకు ఉపాధి లభించే అవకాశం ఉంది.
-
26. ప్రభుత్వ రంగ బ్యాంకుల పర్యవేక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ ఫ్రేమ్ వర్క్ లో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను చేర్చింది ?
1) 21
2) 15
3) 8
4) 11
- View Answer
- సమాధానం: 4
వివరణ: ప్రభుత్వ రంగ బ్యాంకుల పర్యవేక్షణ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ (pca) ఫ్రేమ్ వర్క్ ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. వాటిలో 11 బ్యాంకులను ఇందులో చేర్చింది. అవి.. ఐడీబీఐ, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనెటైడ్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్. త్వరలో మరో నాలుగు పీఎస్ బీలను ఈ జాబితాలో చేర్చే అవకాశం ఉంది.
-
27. ఆసియా, పసిఫిక్ ఎనిమిదో ప్రాంతీయ 3ఆర్ సదస్సు ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) ఇండోర్
3) హైదరాబాద్
4) విశాఖపట్నం
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆసియా, పసిఫిక్ 8వ ప్రాంతీయ 3ఆర్ సదస్సు ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరిగింది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహజన్ ఈ సదస్సుని ప్రారంభించారు. 3ఆర్ అంటే.. రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. ఆసియా - పసిఫిక్ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు, పరిశుభ్రమైన నేల, మంచి గాలి అందించాలన్నది ఈ సదస్సు లక్ష్యం.
-
28. ఆనంద నగరాల సదస్సు ఇటీవల ఏ రాష్ట్రంలో జరిగింది ?
1) ఆంధ్రప్రదేశ్
2) తెలంగాణ
3) కర్ణాటక
4) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: 1
వివరణ: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు ఆనంద నగరాల సదస్సు జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జగ్గీ వాసుదేవ్ కలిసి ఈ సదస్సుని ప్రారంభించారు. ప్రపంచంలోనే తొలిసారిగా ఇలాంటి సదస్సుకి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇచ్చింది. వివిధ దేశాల నుంచి మేధావులు, ఆర్కిటెక్ట్‌లు, నగర ప్రణాళిక నిపుణులు సదస్సులో పాల్గొన్నారు.
-
29. ఈ - వ్యర్థాలను పునర్వినియోగంలోకి తెచ్చేందుకు ప్రపంచంలోనే తొలి మైక్రోఫ్యాక్టరీని రూపొందించిన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు ?
1) సుభాష్ కోట్
2) వీణా సహజ్ వాల్లా
3) క్రిష్ణ చటర్జీ
4) యద్విందర్ మల్హి
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్త వీణా సహజ్ వాల్లా.. ప్రపంచంలోనే తొలిసారిగా మైక్రో ఫ్యాక్టరీని రూపొందించారు. దీని ద్వారా ఈ - వ్యర్థాలను పునర్వినియోగించే వస్తువులుగా తయారు చేయవచ్చు. ఈ మైక్రో ఫ్యాక్టరీ కేవలం 50 చదరపు మీటర్లలో అమర్చవచ్చు.
-
30. భారత్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన ఆర్‌హెచ్ - 300 రాకెట్ ఉద్దేశం ఏమిటి ?
1) భూమి మ్యాపింగ్
2) కమ్యూనికేషన్
3) వాతావరణ పరిశోధన
4) ఖనిజాల అన్వేషణ
- View Answer
- సమాధానం: 3
వివరణ: వాతావరణ పరిశోధనను మరింత మెరుగుపరిచేందుకు ఆర్‌హెచ్ (రోహిణి) - 300 సౌండింగ్ రాకెట్ ను భారత్ ఇటీవల విజయవంతంగా ప్రయోగించింది. విక్రమ్ సారాభాయి అంతరిక్ష కేంద్రం దీన్ని అభివృద్ధి చేసింది.
-
31. ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 8
2) ఏప్రిల్ 10
3) ఏప్రిల్ 12
4) ఏప్రిల్ 14
- View Answer
- సమాధానం: 2
వివరణ: ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ఏటా ఏప్రిల్ 10న నిర్వహిస్తారు. ఫాదర్ ఆఫ్ హోమియోపతిగా గుర్తింపు పొందిన డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడ్రిచ్ సామ్యూల్ హానేమన్ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున నిర్వహిస్తారు. హనేమన్ హోమియోపతి వైద్య విధానాన్ని 1796లో జర్మనీలో ప్రవేశపెట్టారు.
-
32. జాతీయ మాతృత్వసంరక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ?
1) ఏప్రిల్ 11
2) ఏప్రిల్ 13
3) ఏప్రిల్ 15
4) ఏప్రిల్ 9
- View Answer
- సమాధానం: 1
వివరణ: గర్భిణులు, తల్లుల ఆరోగ్య సంరక్షణ, సదుపాయ కల్పనపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏటా ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వివిధ కార్యక్రమాల ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవాలు, గర్భిణుల్లో రక్తహీనత నివారణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు.
2018 Theme : Respectful Maternity Care
-
33. 11వ ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ ఎక్కడ జరగనుంది ?
1) మారిషస్
2) భారత్
3) బంగ్లాదేశ్
4) నేపాల్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 11వ ప్రపంచ హిందీ కాన్ఫరెన్స్ 2018 ఆగస్టు 18 - 20 వరకు మారిషస్ లో జరగనుంది. కేంద్ర విదేశాంగ శాఖ, మారిషస్ ప్రభుత్వం సంయుక్తంగా ఈ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. హిందీ పండితులు, సాహితీ వేత్తలు, భాషాభిమానులు ఈ సదస్సులో పాల్గొంటారు.
Theme : Vaishvik Hindi Aur Bharatiy Sanskriti
-
34. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల భారత తొలి హైస్పీడ్ ఎలక్టిక్ ్రలోకోమోటివ్ (రైల్ ఇంజిన్) ను ప్రారంభించారు. దీని హార్స్ పవర్ ఎంత ?
1) 10000 హెచ్ పీ
2) 12000 హెచ్ పీ
3) 6000 హెచ్ పీ
4) 8000 హెచ్ పీ
- View Answer
- సమాధానం: 2
వివరణ: భారత తొలి హైస్పీడ్ ఎలక్టిక్ ్రలోకోమోటివ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల బిహార్ లోని మాధేపూర్ ఎలక్టిక్ ్రలోకోమోటివ్ ఫ్యాక్టరీలో ప్రారంభించారు. ఇది 12,000 హార్స్ పవర్ శక్తి కలిగి ఉంటుంది. భారతీయ రైల్వే.. ఫ్రాన్స్ కు చెందిన ఆల్ స్టోమ్ తో కలిసి ఈ రైలు ఇంజిన్ ను అభివృద్ధి చేసింది. ఇది గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని కన్నా ముందు భారతీయ రైల్వేలో ఉన్న హైస్పీడ్ లోకోమోటివ్ శక్తి కేవలం 6,000 హార్స్ పవర్ మాత్రమే.
-
35. 16వ అంతర్జాతీయ శక్తి ఫోరమ్(international energy forum) మంత్రుల సమావేశం ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బీజింగ్
3) న్యూయార్క్
4) మాస్కో
- View Answer
- సమాధానం: 1
వివరణ: 16వ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఫోరమ్ మంత్రుల సమావేశం ఇటీవల న్యూఢిల్లీలో ఏప్రిల్ 10 నుంచి 12 వరకు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వడం ఇది రెండోసారి. 1996లో గోవాలో 5వ అంతర్జాతీయ శక్తి ఫోరమ్ మంత్రుల సమావేశం జరిగింది.
Theme : The Future of Global Energy Security: Transition, Technology, Trade and Investment
-
36. 10వ రక్షణ ప్రదర్శన ఇటీవల ఏ నగరంలో జరిగింది ?
1) న్యూఢిల్లీ
2) బెంగళూరు
3) చెన్నై
4) హైదరాబాద్
- View Answer
- సమాధానం: 3
వివరణ: 10వ ఎడిషన్ డిఫెన్స్ ఎక్స్ పో ఇటీవల తమిళనాడులోని చెన్నైలో జరిగింది. కాంచీపురంలో జిల్లా పరిధిలోని తిరువిదంతాల్ లో ఈ ప్రదర్శన నిర్వహించారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. రక్షణ శాఖ నిర్వహించిన ఈ ప్రదర్శనలో 670కిపైగా రక్షణ ఉత్పత్తుల సంస్థలు, 154 విదేశీ సంస్థలు పాల్గొన్నాయి.
Theme : India: The Emerging Defence Manufacturing Hub
-
37. భారత సుప్రీంకోర్టు ఇటీవల ‘‘ సమానుల్లో ప్రథములు’’ అని ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించింది ?
1) భారత ప్రధాన న్యాయమూర్తి
2) భారత ప్రధానమంత్రి
3) భారత రాష్ట్రపతి
4) భారత ఉపరాష్ట్రపతి
- View Answer
- సమాధానం: 1
వివరణ: ధర్మాసనాల ఏర్పాటు, కేసుల కేటాయింపు అంశంలో ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో.. కేసుల కేటాయింపు, బెంచీల ఏర్పాటుపై ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాలను ప్రశ్నిస్తూ అశోక్‌పాండే అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ధర్మాసనాల ఏర్పాటులో, కేసుల కేటాయింపులో సీజేఐ ఇతర సీనియర్ జడ్జీలను సంప్రదించాలని ఆయన కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం సీజేఐ ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానులేనని, కానీ అధికారాల్లో అందరికంటే ప్రథములని పేర్కొంది.
-
38. కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల తిరిగి ఏర్పాటు చేసిన బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో చైర్మన్ గా ఎవరిని నియమించింది ?
1) వినోద్ రాయ్
2) భాను ప్రతాప్ శర్మ
3) ఉర్జిత్ పటేల్
4) రఘురామ్ రాజన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో(బీబీబీ)ని తిరిగి ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా మాజీ ఐఏఎస్ అధికారి భాను ప్రసాద్ శర్మను నియమించింది. అంతకముందు ఉన్న బ్యాంక్స్ బోర్డ్స్ బ్యూరో చైర్మన్ గా మాజీ కాగ్ వినోద్ రాయ్ వ్యవహరించారు. ఈ బోర్డ్ పదవి కాలం మార్చి 2018తో ముగిసింది. ప్రస్తుతం మళ్లీ ఏర్పాటు చేసిన బీబీబీ రెండేళ్ల పాటు ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల అభివృద్ధి కోసం ఇది పనిచేస్తుంది.
-
39. 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ చిత్రం అవార్డుని ఏ సినిమా పొందింది ?
1) విలేజ్ రాకర్స్
2) బాహుబలి - 2
3) మామ్
4) భయానకమ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో అస్సామీ చిత్రం విలేజ్ రాకర్స్ బెస్ట్ ఫ్యూచర్ ఫిల్మ్ అవార్డు దక్కించుకుంది. రిమా దాస్ ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. మలయాళీ చిత్రం భయానకమ్ చిత్ర దర్శకుడు జయరాజ్ ఉత్తమ దర్శకుడు పురస్కారం పొందారు. మామ్ చిత్రానికి గాను దివంగత నటి శ్రీదేవికి ఉత్తమ నటి అవార్డు ప్రకటించారు. నగర్ కిర్టాన్ చిత్రానికి గాను రిద్ధిసేన్ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. తెలుగు నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఘాజీ అవార్డు దక్కించుకుంది.
-
40. 49వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు - 2017 ని ఇటీవల ఎవరికి ప్రకటించారు ?
1) శ్రీదేవి
2) వినోద్ ఖన్నా
3) జాకీ ష్రాఫ్
4) మోహన్ బాబు
- View Answer
- సమాధానం: 2
వివరణ: 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా.. 49వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నాకు ప్రకటించారు. మరణాంతరం ఆయనకు ఈ అవార్డు ప్రకటించారు. ఆయన 146 చిత్రాల్లో నటించారు. వాజ్ పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
-
41. చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాలను ఏ రాష్ట్రం నిర్వహించింది ?
1) ఉత్తరప్రదేశ్
2) బిహార్
3) గుజరాత్
4) రాజస్తాన్
- View Answer
- సమాధానం: 2
వివరణ: మహాత్మగాంధీ ప్రారంభించిన చంపారన్ సత్యాగ్రహం 2017 ఏప్రిల్ 10 నాటికి వందేళ్లు పూర్తి చేసుకోవడంతో సంవత్సరం పాటు చంపారన్ సత్యాగ్రహ వేడుకలు నిర్వహించాలని బిహార్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బిహార్‌లోని మోతిహారీలో ఏప్రిల్ 10న జరిగిన కార్యక్రమంలో 20 వేల మంది స్వచ్ఛాగ్రహి లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కతిహార్-పాత ఢిల్లీ మధ్య నడవనున్న చంపారన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించారు.
-
42. తెలంగాణ డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?
1) మహేందర్ రెడ్డి
2) మహేశ్ భగవత్
3) శ్రీనివాసులు రెడ్డి
4) అనురాగ్ శర్మ
- View Answer
- సమాధానం: 1
వివరణ: తెలంగాణ రాష్ట్ర డీజీపీగా ఎం.మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. 2017 నవంబర్ 12 నుంచి ఇన్చార్జి డీజీపీగా ఉన్న ఆయనను పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీని నియమించుకునే అధికారాన్ని రాష్ట్రానికే కల్పిస్తూ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ప్రకారం ఆయనను నియమించారు.
-
43. కింది వారిలో ఎవరు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమితులయ్యారు ?
1) వర్ల రామయ్య
2) రాఘవేంద్రరావు
3) పుట్టా సుధాకర్ యాదవ్
4) కొత్తపల్లి సుబ్బారాయుడు
- View Answer
- సమాధానం: 3
వివరణ: తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా కడప జిల్లాకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ నియమితులయ్యారు. ఏపీఎస్ర్టీసీ చైర్మన్‌గా వర్ల రామయ్యను నియమించారు. ఈ మేరకు రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
-
44. దాదా సాహెబ్ ఫాల్కే ఎక్సలెన్స్ అవార్డు - 2018 కి ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ?
1) రణ్వీర్ సింగ్
2) షాహీద్ కపూర్
3) అమీర్ ఖాన్
4) సల్మాన్ ఖాన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: బాలీవుడ్ నటి, నిర్మాత అనుష్కశర్మ, నటుడు రణ్వీర్ సింగ్ దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. మంచి కథలతో సినిమాల నిర్మాణానికి చొరవ చూపుతున్నందుకు గుర్తింపుగా అనుష్క, పద్మావతి చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీగా అద్భుత నటనను కనబర్చినందుకు రణ్వీర్ కు ఈ అవార్డు అందజేయాలని నిర్ణయించినట్లు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ తెలిపింది. తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి నిర్మాణ సంస్థను ప్రారంభించిన అనుష్క ‘ఎన్‌హెచ్ 10’ అనే చిత్రాన్ని నిర్మించింది. దీంతో 25 ఏళ్ల వయసులోనే యంగెస్ట్ ప్రొడ్యూసర్‌గా అనుష్క గుర్తింపు పొందింది.
-
45. తెలంగాణ ప్రభుత్వం నల్గొండ జిల్లాలో నిర్మిస్తున్న డిండి ఎత్తిపోతల పథకానికి ఎవరి పేరు పెట్టింది ?
1) ప్రొఫెసర్ జయశంకర్
2) కాళోజీ
3) ఆర్. విద్యాసాగర్
4) వెంకటస్వామి
- View Answer
- సమాధానం: 3
వివరణ: ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకానికి సాగునీటి రంగ నిపుణుడు ఆర్.విద్యాసాగర్‌రావు పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై ఈ ప్రాజెక్టును ‘‘ఆర్.విద్యాసాగర్‌రావు డిండి ఎత్తిపోతల పథకం’’గా పరిగణిస్తారు. విద్యాసాగర్ రావు సాగునీటి రంగంలో తెలంగాణకు జరిగిన వివక్షను వెలుగులోకి తెచ్చారు. సంక్లిష్టమైన విషయాలను సులువుగా అర్థమయ్యేలా చెప్పి ప్రజలను చైతన్య పరిచారు.
-
46. ఇటీవల కన్నుమూసిన ప్రముఖ వైద్యుడు ఏపీ రంగారావు ఈ కింది వాటిలో ఏ అంశానికి సంబంధించిన వారు ?
1) 108, 104 సేవల వ్యూహకర్త
2) ఆరోగ్యశ్రీ రూపకర్త
3) 100 విధాన రూపకర్త
4) కల్యాణలక్ష్మీ వ్యూహకర్త
- View Answer
- సమాధానం: 1
వివరణ: 108, 104 అంబులెన్స్ సహాయ సేవల వ్యూహకర్త డాక్టర్ అయితరాజు పాండు రంగారావు ఇటీవల కన్నుమూశారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామానికి చెందిన రంగారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెడ్‌క్రాస్ సొసైటీ మాజీ కార్యదర్శిగా, దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రి చైర్మన్‌గా, భద్రాచలం ట్రైబల్ ఏరియా ఆస్పత్రి వైద్యాధికారిగా పలు సేవలందించారు. జోగినీ వ్యవస్థ నిర్మూలనకు, వారి పిల్లల చదువుల కోసం విశేషంగా కృషి చేశారు. ‘హోపింగ్ మెమరీస్’ పేరుతో ఈయన ఆత్మకథ కూడా ప్రచురితమైంది.
-
47. భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలను అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏది ?
1) లాండ్ ఆధార్
2) భూధార్
3) ఈ-లాండ్
4) భూ రిజిస్టర్
- View Answer
- సమాధానం: 2
వివరణ: ఆంధ్రప్రదేశ్‌లో భూధార్ ప్రయోగాత్మక పథకాన్ని ఇటీవల విజయవాడలో ప్రారంభించారు. దీన్ని కృష్ణా జిల్లా ఉయ్యూరు, జగ్గయ్యపేట మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. భూములు, ఆస్తుల లావాదేవీల్లో అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం భూధార్‌ను ప్రారంభించింది.
-
48. ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో నంబర్ వన్ స్థానానికి చేరిన తొలి భారతీయ ప్లేయర్ గా ఇటీవల గుర్తింపు సాధించింది ఎవరు ?
1) కిదాంబి శ్రీకాంత్
2) పారుపల్లి కశ్యప్
3) సాయి ప్రణీత్
4) లక్ష్య సేన్
- View Answer
- సమాధానం: 1
వివరణ: భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య ఏప్రిల్ 12న ప్రకటించిన ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచాడు. తాజా ర్యాంక్‌తో కంప్యూటరైజ్డ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ అయిన తొలి భారతీయ ప్లేయర్‌గా శ్రీకాంత్ గుర్తింపు పొందాడు. 2015 లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది.
-
49. 21వ కామన్వెల్త్ గేమ్స్ మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఎవరిని ఓడించి స్వర్ణం గెలుచుకుంది ?
1) పీవీ సింధు
2) కిర్ స్టీ గిల్మోర్
3) మిచెల్లీ లీ
4) సోనియా చెహ్
- View Answer
- సమాధానం: 1
వివరణ: కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో సైనా నెహ్వాల్... పీవీ సింధుపై విజయం సాధించి స్వర్ణ పతకం గెలుచుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. ఇంతకుముందు 2010లో ఢిల్లీలో జరిగిన క్రీడల్లోనూ స్వర్ణం గెలుచుకుంది.
-
50. ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ లో జరిగిన 21వ కామన్వెల్త్ గేమ్స్ పతకాల్లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ?
1) ఒకటి
2) రెండు
3) మూడు
4) నాలుగు
- View Answer
- సమాధానం: 3
వివరణ: 21వ కామన్వెల్త్ గేమ్స్ ఏప్రిల్ 4 నుంచి 15 వరకు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరిగాయి. ఇందులో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలతో కలిపి మొత్తం 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. మొత్తం 198 పతకాల (80 స్వర్ణాలు) తో ఆస్ట్రేలియా తొలి స్థానం, ఇంగ్లండ్ 136 పతకాల ( 45 స్వర్ణాలు)తో రెండో స్థానంలో నిలిచాయి.
-