Volodymyr Zelensky: టైమ్స్ ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా జెలెన్‌స్కీ
Sakshi Education
‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-2022’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ(Volodymyr Zelensky)ని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్ మేగజీన్ తాజా సంచిక ప్రచురించింది.
‘ఉక్రెయిన్ సహా విదేశాల్లో చాలా మంది వొలొదిమిర్ జెలెన్‌స్కీని హీరోగా అభివర్ణిస్తున్నారు. 2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది. ప్రతీ సంవత్సరం వార్తల్లో నిలిచిన ఓ వ్యక్తిని టైమ్ మేగజీన్ పర్సన్ ఆఫ్ ది ఈయర్ గా ప్రకటించి, పత్రికలో ఆ వ్యక్తిపై ప్రత్యేక కథనాలను ప్రచురిస్తుంది.
22nd law commission of india: లా కమిషన్ చైర్‌పర్సన్ గా జస్టిస్ రితురాజ్ అవస్థి
Published date : 08 Dec 2022 12:51PM