COVID-19: ప్రముఖ నృత్యదర్శకుడు శివ శంకర్ ఇక లేరు
ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు శివ శంకర్ (72) మాస్టర్ ఇకలేరు. కరోనా వైరస్ సోకడంతో కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ, నవంబర్ 28న తుదిశ్వాస విడిచారు. కల్యాణ సుందరం, కోమళ అమ్మాళ్ దంపతులకు 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించిన శివ శంకర్ ‘కురువి కూడు’ (1980) అనే తమిళ చిత్రం ద్వారా నృత్యదర్శకుడిగా మారారు. తెలుగు, తమిళంతో సహా పది భాషల్లో సుమారు 800 చిత్రాల్లో 15వేలకు పైగా పాటలకు నృత్యదర్శకుడిగా చేశారు. మగధీర(2009) చిత్రానికి ఉత్తమ నృత్యదర్శకుడిగా జాతీయ అవార్డు అందుకున్నారు. నటుడిగా తెలుగు, తమిళ సినిమాల్లో–సీరియల్‌లలో తనదైన గుర్తింపు పొందారు.
చదవండి: ఇంటర్‌పోల్ 91వ సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ నృత్యదర్శకుడు, నటుడు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : శివ శంకర్ (72) మాస్టర్
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్